అలాపై పెదవి విప్పిన సుశాంత్

అక్కినేని హీరోగా వెండి తెరకు పరిచయమయిన నాగ సుశీల కొడుకు సుశాంత్. కెరీర్ మొదట్లో చేసిన సినిమాలేవీ సక్సెస్ ని అందివ్వలేదు. కానీ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో [more]

Update: 2020-02-17 10:27 GMT

అక్కినేని హీరోగా వెండి తెరకు పరిచయమయిన నాగ సుశీల కొడుకు సుశాంత్. కెరీర్ మొదట్లో చేసిన సినిమాలేవీ సక్సెస్ ని అందివ్వలేదు. కానీ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో సుశాంత్ చేసిన చిలసౌ సినిమా సూపర్ హిట్ అవటంతో సుశాంత్ సినిమాల మీద ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. కానీ సుశాంత్ చిలసౌ తర్వాత హీరోగా సినిమా చెయ్యకుండా అల్లు అర్జున్ హీరో కాబట్టి, త్రివిక్రమ్ అడిగాడు కదా అని అల వైకుంఠపురములో సినిమాలో ఓ డమ్మీ కేరెక్టర్ చేసాడు. ఆ కేరెక్టర్ సుశాంత్ ఎందుకు ఒప్పుకున్నాడో సినిమా చూసిన వాళ్ళకెవరికి అర్ధం కాలేదు. సుశాంత్ కేరెక్టర్ ఆ సినిమాలో అలా ఉంది మరి. సినిమా బ్లాక్ బస్టర్ కానీ.. సుశాంత్ కి ఒరిగింది ఏమి లేదు.

కానీ సినిమా విజయంలో తాను భాగస్వామిని అని, అలాగే అల వైకుంఠపురములో నటించడానికి చాలా కారణాలు ఉన్నాయి. అయితే ఆ సినిమా చేసినందుకు నేను చాల సంతోషిస్తున్నాను అంటూ తాజాగా అలా సినిమాపై సుశాంత్ స్పందించాడు. ఇక సినిమాలో తన స్క్రీన్ టైం, అండ్ కేరెక్టర్ పరంగా చెప్పాల్సి వస్తే.. భారీ తారాగణంతోనూ, ప్రతిభావంతులైన సాంకేతిక బృందంతో పనిచేస్తున్నప్పుడు, టీం ప్లేయర్ గానే ఉండాలి కానీ ఎక్కువ ఎక్సపెక్ట్ చెయ్యకూడదని చెప్పడమే కాదు.. అల వైకుంఠపురములో తనకి సంబందించిన ఫన్నీ సీన్స్ ని యూట్యూబ్ లో విడుదల చేస్తున్నట్టుగా చెబుతున్నాడు

Tags:    

Similar News