సుశాంత్ కు లక్కీ ఛాన్స్

పెద్ద హీరోలకి సినిమాలు డిజాస్టర్స్ అయినా పర్లేదు. ఎందుకంటే వారికి ఒక సినిమా కాకపోతే ఇంకో సినిమా వస్తుంది. కొంచం లేట్ అయినా కచ్చితంగా ఏదొక సినిమా [more]

Update: 2019-04-14 10:11 GMT

పెద్ద హీరోలకి సినిమాలు డిజాస్టర్స్ అయినా పర్లేదు. ఎందుకంటే వారికి ఒక సినిమా కాకపోతే ఇంకో సినిమా వస్తుంది. కొంచం లేట్ అయినా కచ్చితంగా ఏదొక సినిమా వస్తూనే ఉంటుంది. కానీ చిన్న మిడ్ రేంజ్ హీరోల పరిస్థితి అలా కాదు. ఒక్క సినిమా ప్లాప్ అయినా చాలా ఏళ్ళ గ్యాప్ తీసుకోవాల్సి వస్తుంది.

మంచి సినిమా కోసం మంచి డైరెక్టర్ కోసం చాలా వెయిట్ చేయాలి. అలా వరసగా ప్లాప్స్ వస్తున్నా టైములోనే చిన్న డెసిషన్స్ తీసుకుంటారు మన హీరోస్. సుశాంత్ ప్రస్తుతం అటువంటి ఓ మంచి నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం ఆయనకు సరైన సినిమా పడకుండా, ఇబ్బంది పడుతున్న టైములో త్రివిక్రమ్ తో చేయడానికి మంచి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.

బన్నీ హీరోగా హారిక హాసిని-గీతా కలిసి నిర్మించే సినిమాలో ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ను సుశాంత్ కు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. కెరీర్ ను సరైన మార్గం లో నడిపించాలంటే ఇటువంటి ఛాన్స్ లు వదులుకోకూడదు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సిఉంది.

Tags:    

Similar News