సుశాంత్ ఆత్మహత్యని వాడుకుందామనుకుని.. బుక్కయ్యింది!!

సుశాంత్ సింగ్ రాజాపుత్ ఆత్మహత్యకి కారణం బాలీవుడ్ లో జరిగే నేపోటీజమే కారణమంటూ బాలీవుడ్ టాప్ హీరోయిన్ కంగనా నెత్తీ నోరు బాదుకుంటుంది. మొదటినుండి బాలీవుడ్ వారసత్వ [more]

Update: 2020-08-26 04:05 GMT

సుశాంత్ సింగ్ రాజాపుత్ ఆత్మహత్యకి కారణం బాలీవుడ్ లో జరిగే నేపోటీజమే కారణమంటూ బాలీవుడ్ టాప్ హీరోయిన్ కంగనా నెత్తీ నోరు బాదుకుంటుంది. మొదటినుండి బాలీవుడ్ వారసత్వ పోకడల మీద యుద్ధం చేసే కంగనాకు ఫైర్ బ్రాండ్ అని పేరుంది. బాలీవుడ్ లో సినిమా నేపథ్యం ఉన్న స్టార్స్ మీద అకారణంగా విరుచుకుపడే కంగనా అంటే చాలామందికి మంట. కానీ బయట పడరు, కారణం ఆమె అంటే భయం కాదు.. ఆమె నోటు మెదిపితే ఎక్కడ వాళ్ళ… పర్సనల్ విషయాలు ఎక్కడ బయటికొస్తాయో అనే భయం అంతే.

అయితే తాజాగా సుశాంత్ సింగ్ మరణం తర్వాత కంగనా వీర లెవల్లో రెచ్చిపోతుంది. అయితే ఆమె దూకుడుకి సుశాంత్ సింగ్ రాజపుట్ ఫ్యామిలీ కళ్లెం వేసింది. మా కొడుకు మృతికి బాలీవుడ్ నేపోటిజానికి సంబంధం లేదని తేల్చేసారు. కేవలం రియా పెట్టిన మానసిక క్షోభ వలనే చనిపోయాడని అంటున్నారు. అక్కడే ఎదురు దెబ్బ తగిలిన కంగానికి ఇప్పుడు గతంలో సుశాంత్ చిన్న నటుడు అంటూ నేను చెయ్యను అని కంగనా చెప్పిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హైలెట్ అవుతుంది.

సుశాంత్ బ్రతికున్నపుడు చిన్న నటుడిగా చూసిన నువ్వు… సుశాంత్ సింగ్ మరణించగానే జాలి ఆకలిగి అతని మరణాన్ని నీకు అనుకూలంగా వాడుకుంటావా అంటూ బాయ్‍కాట్‍ కంగన హాష్ టాగ్ తో కంగనాకి చుక్కలు చూపిస్తున్నారు నెటిజెన్స్. మరోపక్క బాలీవుడ్ నేపోటీజాన్ని పట్టుకుని వేలాడుతున్న నువ్వు సుశాంత్ సింగ్ మరణానికి కారణమంటున్న రియా చక్రవర్తి గురించి మాట్లాడకుండా దాటవేస్తుంది అంటూ కంగనా పై ఓ వర్గం ఫైర్ అవుతుంది. సో సుశాంత్ మరణాన్ని వాడుకుని హైలెట్ అవుదామనుకున్న కంగనా ఇప్పుడు అడ్డంగా బుక్కయ్యింది.

Tags:    

Similar News