కాంతం గట్టి పోటీ ఇచ్చేలా ఉందే..!

ఈ శుక్రవారం రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అసలు ప్రమోషనల్ ఈవెంట్స్ లేకుండానే లక్ష్మీస్ ఎన్టీఆర్ కి [more]

Update: 2019-03-27 08:14 GMT

ఈ శుక్రవారం రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అసలు ప్రమోషనల్ ఈవెంట్స్ లేకుండానే లక్ష్మీస్ ఎన్టీఆర్ కి బీభత్సమైన క్రేజ్ ప్రేక్షకుల్లో, ట్రేడ్ లో ఉంది. వర్మ ఆ రకంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాడు. ఇక ఈ శుక్రవారమే మరో మూవీ కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ కి పోటీగా విడుదల కానుంది. అది మెగా డాటర్ నిహారిక నటించిన సూర్యకాంతం సినిమా. సూర్యకాంతం తక్కువ బడ్జెట్ తో తెరకెక్కినా.. సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. ఆ సినిమా ప్రమోషన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.

ఆకట్టుకుంటున్న సూర్యకాంతం

నిన్నగాక మొన్న క్రేజీ స్టార్ హీరో విజయ్ దేవరకొండ సూర్యకాంతం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరై సినిమాని పొగిడేసాడు. ఇక నిన్న విడుదలైన సూర్యకాంతం ట్రైలర్ చూస్తే సినిమా మీద ప్రేక్షకుల్లో ఆసక్తి క్రియేట్ అయినట్లే అనిపిస్తుంది. ఈ సినిమాలో అడుగడుగునా నిహారిక డామినేషన్ కనబడుతుంది. పాత కాలంలో సూర్యకాంతం నోటికి భయపడేలా దర్శకులు ఆమెకి మాటలు రాసేవారు. దర్శకులు రాసిన డైలాగ్స్ కన్నా సూర్యకాంతం గయ్యాళిగా చెప్పే డైలాగ్స్ అదుర్స్ అన్న రీతిలో ఉండేవి. ఇక ఇప్పుడు ఈ మోడ్రెన్ సూర్యకాంతం కూడా నోరేసుకుని పడిపోతుంది. రాహుల్ విజయ్ హీరోగా నటించిన ఈ సినిమాలో అందరి కళ్లూ నిహారిక సూర్యకాంతం క్యారెక్టర్ మీదే ఉన్నాయి. ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మొత్తం నిహారిక చుట్టూనే తిరిగేలా కనబడుతుంది. హీరో విజయ్ ని వేయించుకు తినే క్యారెక్టర్ లో సూర్యకాంతంగా నిహారిక రెచ్చిపోనుంది. మరి ట్రైలర్ చూసాక లక్ష్మీస్ ఎన్టీఆర్ కి ఈ కాంతం గారు గట్టి పోటీ ఇచ్చేలాగానే కనబడుతుంది.

Tags:    

Similar News