అందుకే సూర్య సైడ్ అయ్యాడు

Update: 2018-05-10 06:56 GMT

ఇప్పుడు ఎక్కడ చూసిన మహానటి ముచ్చట్లే. మహానటి విడుదలకు ముందు ఇంత క్రేజ్ అయితే సినిమా మీద లేదు. కానీ విడుదలయ్యాక మాత్రం మహానటి గురించిన డిస్కర్షన్స్ ఫిలింసర్కిల్స్ లో బయలుదేరాయి. దర్శకుడు నాగ్ అశ్విన్ మహానటి సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడని... మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించలేదు.. జీవించిందని.. మధురవాణి కేరెక్టర్ కి ఎక్కువ స్కోప్ లేకపోయినా సమంత ఉన్నంతలో అదరగొట్టిందని... మిక్కీ జె మేయర్ బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతమని... ఇలా మహానటి సినిమాపై అందరూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం, కొన్ని లాగింగ్ సీన్స్ తో పాటు ఏఎన్నార్ పాత్రలో కనబడిన నాగ చైతన్య తన తాతగారి పాత్రలో తేలిపోయాడనే పాయింట్స్ తప్పనిస్తే.... సినిమా ఓవరాల్ గా హిట్ పడింది. అయితే ఈ సినిమాలో సావిత్రి నిజ జీవితంలో, నట జీవితంలో జెమిని గణేశన్ చేతిలో ఎలా మోసపోయింది. జెమిని గణేశన్ వలన సావిత్రి తన జీవితాన్ని ఎలా కోల్పోయిందో అనే దానిని నాగ్ అశ్విన్ ఎవరికీ భయపడకుండా ఉన్నది ఉన్నట్టుగా చూపించి.. ఈ సినిమా లో జెమిని గణేశన్ ని విలన్ ని చేసాడు. జెమిని స్త్రీ లోలుడని.. అతని వల్లే సావిత్రి పతనమైందని.. కళ్ళకు కట్టినట్టుగా ఉన్నది ఉన్నట్టుగా చూపెట్టాడు.

మరి జెమిని గణేశన్ కి తమిళనాట విపరీతమైన పాపులారిటీ ఉండేది. మహానటి మూవీ లో జెమిని గణేశన్ దాదాపు విలన్. అందుకేనేమో తమిళ స్టార్ హీరో సూర్య మహానటిలో జెమిని గణేశన్ పాత్ర చెయ్యడానికి ఒప్పుకోలేదు. ఇక సూర్య ఆ పాత్ర చెయ్యనని సైడ్ అవడంతో మలయాళ నటుడు.. తెలుగులో ఒకే బంగారంతో పాపులారిటీ సంపాదించిన దుల్కర్ సల్మాన్ ని నాగ్ అశ్విన్ జెమిని గణేశన్ పాత్రకి ఎంపిక చేసాడు. మరి ఈ పాత్రని సూర్య గనక చేసుంటే.. తమిళనాట సూర్య తీవ్ర వ్యతిరేఖత ఎదుర్కోవాల్సి వచ్చేది. మరి సూర్య అప్పుడు అలా సైడ్ అవడం కరెక్ట్. ఇక కోలీవుడ్ లో మహానటి మూవీ రేపు విడుదలకాబోతుంది.

Similar News