సూర్య సినిమాల బ్యాన్..!

లాక్ డౌన్ వలన థియేటర్స్ ఇప్పటిలో తెరుచుకునే అవకాశంలేదు. ఎట్టలేదన్న ఒక ఆరు నెలలు టైం పడుతుంది. ఒకవేళ ఆరు నెలలు తరువాత థియేటర్స్ ఓపెన్ అయినా [more]

Update: 2020-04-26 06:46 GMT

లాక్ డౌన్ వలన థియేటర్స్ ఇప్పటిలో తెరుచుకునే అవకాశంలేదు. ఎట్టలేదన్న ఒక ఆరు నెలలు టైం పడుతుంది. ఒకవేళ ఆరు నెలలు తరువాత థియేటర్స్ ఓపెన్ అయినా కొంత కాలం పాటు ఆశించిన స్థాయిలో రెవెన్యూ ఉండదంటున్నారు కొంతమంది ప్రొడ్యూసర్స్.

కానీ చిన్న సినిమా నిర్మాతలు మాత్రం వడ్డీ భారం తట్టుకోలేక ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌లో నేరుగా రిలీజ్ చేసేయడానికి రెడీ అవుతున్నారు. ఇందులో ముఖ్యంగా తమిళ పరిశ్రమ నుండి ముందుగా జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన ‘పొన్ మగల్ వందాల్’ సినిమా రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతున్నారు. అయితే ఈసినిమా రిలీజ్ ను థియేటర్స్ లో చేయకుండా నేరుగా ఓటీటీల్లో ఎలా రిలీజ్ చేస్తారని ఆ సంఘం ప్రశ్నించింది. జ్యోతిక సినిమాను కచ్చితంగా థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలనీ కండిషన్ పెట్టారు ఆ సంఘం.

తమ మాట కాదని ప్రైమ్‌లో రిలీజ్ చేస్తే.. భవిష్యత్తులో సూర్య సినిమాలతో పాటు అతడి నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్టైన్మెంట్స్ బేనర్ నుంచి వచ్చే ఏ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ కానివ్వమని ఆ సంఘం ప్రతినిధులు ఓ ప్రకటనలో హెచ్చరించారు. గతంలో ఇలానే కమల్ హాసన్ నటించిన ‘విశ్వరూపం’ను నేరుగా ఆన్ లైన్ లో రిలీజ్ చేయాలనీ చూసారు కానీ అప్పుడు కూడా తమిళనాడు థియేటర్ల సంఘమే అడ్డు పడడంతో ఆ సినిమాను థియేటర్ రిలీజ్ చేశారు. మరి థియేటర్స్ సంఘం మాట విని జ్యోతిక సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేస్తారో లేదో చూడాలి.

Tags:    

Similar News