సూర్య ఫాన్స్ గోల మాములుగా లేదు!!

హీరో సూర్య సింగం సీరీస్ లో మొదటి రెండు పార్ట్స్ లో అందుకున్న విజయం తర్వాత మళ్ళీ ఇంతవరకు హిట్ కొట్టలేదు. మధ్యలో గ్యాంగ్, బందోబస్త్ ఇలాంటి [more]

Update: 2020-11-15 04:25 GMT

హీరో సూర్య సింగం సీరీస్ లో మొదటి రెండు పార్ట్స్ లో అందుకున్న విజయం తర్వాత మళ్ళీ ఇంతవరకు హిట్ కొట్టలేదు. మధ్యలో గ్యాంగ్, బందోబస్త్ ఇలాంటి సినిమాలతో సూర్య వరస ప్లాప్స్ తో ఉన్నాడు. అలాంటిది సూర్య – సుధా కొంగర కాంబోలో సినిమా అనగానే  అందరిలో ఆసక్తి ఉన్నా సినిమాపై అంచనాలు అంతగా లేవు, బయోపిక్ లపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఉన్నా ట్రేడ్ లో అంచనాలు ఉండవు. సూర్య ఆకాశం నీ హద్దురా సినిమా పై అందరిలో పిచ్చ క్యూరియాసిటీ ఉంది. అయితే మంచి ప్రమోషన్స్ తో ఈ సినిమాని ఓటిటి లో  విడుదల చేసాడు. సూర్య. భారీ కాకపోయినా ఓ మాదిరి బడ్జెట్ ఉన్న ఆకాశం నీ హద్దురా సినిమాని థియేటర్స్ లో విడుదల చేస్తే ఆ మజానే వేరు. కానీ సూర్య థియేటర్స్ కోసం వేచి చూడకుండా ఓటిటికి అమ్మేశాడు.

అయితే ఇప్పుడు ఆ సినిమాకి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ పడడంతో సూర్య ఫాన్స్ గోల గోల చేస్తున్నారు. ఆకాశం నీ హద్దురా సినిమా గనక థియేటర్స్ లో విడుదలైతే బిసి సెంటర్స్ లో భారీ కలెక్షన్స్ వచ్చేవి.. అలాగే సూర్య ప్లాప్ లకు ఆకాశం తో బ్రేక్ వేసేవాడు. ఇప్పుడు ఈ సినిమా ఓటిటి లో విడుదల కావడంతో.. ఆ బ్లాక్ బస్టర్ టాక్ ని సూర్య ఫాన్స్ ఎంజాయ్ చెయ్యలేకపోతున్నారట. అదే థియేటర్స్ లో అయితే బ్యానర్స్ కట్టి.. పార్టీ చేసుకునే వాళ్ళం, కానీ ఓటిటిలో విదుడయినా ఆకాశం నీ హద్దురా కి సందడి లేదు ఏమి లేదని ఫీలవుతున్నారట.

Tags:    

Similar News