విజయ్ కు ఎర్త్ పెట్టిన సూర్య..!

విజయ్ దేవరకొండ తెలుగులో ఫుల్ క్రేజ్ ఉన్న హీరో. అలాగే అనూహ్యంగా గీత గోవిందం సినిమాతో విజయ్ మార్కెట్ కూడా బాగా పెరిగింది. తెలుగుతో పాటు తమిళంలోనూ [more]

Update: 2019-03-26 09:58 GMT

విజయ్ దేవరకొండ తెలుగులో ఫుల్ క్రేజ్ ఉన్న హీరో. అలాగే అనూహ్యంగా గీత గోవిందం సినిమాతో విజయ్ మార్కెట్ కూడా బాగా పెరిగింది. తెలుగుతో పాటు తమిళంలోనూ విజయ్ దేవరకొండ క్రేజ్ ని విస్తరించాలనుకున్నాడు. అందుకే తమిళంలో స్ట్రయిట్ గా నోటా సినిమా చేసాడు. ఆ సినిమాతో విజయ్ దేవరకొండ క్రేజ్ తమిళనాట వ్యాప్తి చెందడం ఏమో కానీ ఆ సినిమాతో విజయ్ డిజాస్టర్ అందుకున్నాడు. అలా తమిళనాట కూడా ఫాన్స్ ని ఏర్పరుచుకున్నారు. అందుకే ఇక తన సినిమాలన్నీ తమిళంలో విడుదల చెయ్యడానికి పక్కాగా ప్లాన్ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. తాజాగా నటిస్తున్న డియర్ కామ్రేడ్ ని తెలుగులోనే కాదు తమిళం, మలయాళం, కన్నడలో కూడా విడుదల చేసే ప్లాన్ చేసాడు. అయితే ఈ సినిమాని మే 31న నాలుగు భాషల్లో విడుదల చెయ్యడానికి మైత్రి మూవీస్ వారు సిద్ధమవుతున్నారు.

అదే రోజు ఎన్.జి.కే విడుదల

అయితే ఇప్పుడు విజయ్ కి పోటీగా తమిళంలో మరో స్టార్ హీరో తన సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాడు. విజయ్ దేవరకొండ ఏ సినిమాతో పోటీ ఉండ‌ద‌నే ఉద్దేశంతో మే 31న డియ‌ర్ కామ్రేడ్ అన్ని భాష‌ల్లో ఒకేసారి రిలీజ్ అవుతుంద‌ని చెప్పాడు. కానీ కోలీవుడ్ హీరో సూర్య ఇప్పుడు విజయ్ కి చెక్ పెట్టాడు. సూర్య తన ఎన్‌.జి.కే సినిమాని కూడా మే 31న విడుదలకు డేట్ ఎనౌన్స్ చేసాడు. సూర్య సినిమాలు వరుసగా ఫ్లాప్ అయినా అతని సినిమాలుకు కోలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది. మరి విజయ్ ఎలాంటి పోటీ లేకుండా డియర్ కామ్రేడ్ ని కోలీవుడ్ లో కూల్ గా విడుదల చేద్దామనుకుంటే.. ఇప్పుడు విజయ్ కి సూర్య పోటీగా కనబడుతున్నాడు. విజయ్ దేవరకొండ ఇప్పుడేం చేస్తాడో చూడాలి.

Tags:    

Similar News