విజయ్ తండ్రిగా మలయాళం సీనియర్ హీరో?

పూరి జగన్నాధ్ – విజయ్ దేవరకొండ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ఫైటర్ కరోనా కారణముగా ఏడు నెలలు వాయిదా పడింది. అందరూ షూటింగ్స్ షూటింగ్స్ [more]

Update: 2020-11-28 09:45 GMT

పూరి జగన్నాధ్ – విజయ్ దేవరకొండ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ఫైటర్ కరోనా కారణముగా ఏడు నెలలు వాయిదా పడింది. అందరూ షూటింగ్స్ షూటింగ్స్ అంటుంటే విజయ్ అండ్ పూరి లు కామ్ గా ఆరామ్స్ గా డిసెంబర్ మొదటి వారం నుండి సెట్స్ మీదకి వెళతాం అని చెబుతున్నారు. ముంబై పరిసర ప్రాంతాల్లో చిత్రకరణ జరుపుకున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. విజయ్ తల్లిగా రమ్యకృష్ణ నటిస్తుండగా.. తండ్రి పోషించబోయే నటుడు పేరు ఇదే అంటూ అప్పట్లో ఏవేవో పేర్లు తెర మీదకి వచ్చినా.. తాజాగా విజయ్ తండ్రి పాత్రకి సీనియర్ నటుడు సురేష్ గోపిని ఎంపిక చేసుకున్నట్టుగా తెలుస్తుంది. 

మలయాళం లో ఒకప్పుడు స్టార్ హీరో రేంజ్ లో ఉన్న సురేష్ గోపి ప్రస్తుతం సీనియర్స్ లిస్ట్ లో ఉన్న నటుడు. ఇప్పుడు సురేష్ గోపిని విజయ్ దేవరకొండ ఫాదర్ గా పూరి ఎంపిక చెసుకోవడంతో సినిమాపై అంచనాలు పెరగడం ఖాయం అంటున్నారు. ఫైటర్ సినిమాలో విజయ్ దేవరకొండ తండ్రి డాన్ పాత్రలో కనిపిస్తాడని టాక్ ఉంది. ఇక సినిమాలో కొడుకు – తండ్రి సెంటిమెంట్ హైలెట్ అవుతుంది అని.. డాన్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుంది అని.. అందుకే ఆ పాత్రకోసం సురేష్ గోపిని పూరి సంప్రదించాడని.. పాత్ర వెయిట్ ని బట్టి సురేష్ గోపి కూడా ఒప్పుకోవచ్చనే ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Tags:    

Similar News