అందరి చూపు ఆయన మీదే

కిక్, ఊసరవెల్లి, రేసుగుర్రం ధ్రువ లాంటి కమర్షియల్ చిత్రాల దర్శకుడు సురేందర్ రెడ్డి చేతిలో చారిత్రాత్మక చిత్రాన్ని పెడితే ఎలా హ్యాండిల్ చేస్తాడో అనుకున్నారు. అసలు సురేందర్ [more]

Update: 2019-10-05 06:22 GMT

కిక్, ఊసరవెల్లి, రేసుగుర్రం ధ్రువ లాంటి కమర్షియల్ చిత్రాల దర్శకుడు సురేందర్ రెడ్డి చేతిలో చారిత్రాత్మక చిత్రాన్ని పెడితే ఎలా హ్యాండిల్ చేస్తాడో అనుకున్నారు. అసలు సురేందర్ రెడ్డి సైరా నరసింహారెడ్డి సినిమాకి డైరెక్టర్ గా బాగానే చేశారని షాకయినవాళ్లు ఉన్నారు, పెదవి విరిచిన వాళ్ళు ఉన్నారు. అయితే సైరా మేకింగ్ వీడియోస్, ట్రైలర్ విడుదల య్యాకే సురేందర్ రెడ్డి సత్తా చాలా వరకు బయటికి వచ్చింది. తాజాగా సైరా సినిమా కూడా హిట్ టాక్ తో థియేటర్స్ దుమ్ము దులుపుతుంది. సురేందర్ రెడ్డి తన శక్తి మేర సైరా సినిమా కోసం కష్ట పడ్డాడు.

ఆయన సక్సెస్ అయ్యారు…..

యాక్షన్ సీన్స్ ని తెరకెక్కించడంలోనూ, పాత్రలను మలిచిన తీరుని, చిరులోని హీరోయిజాన్ని చూపించడంలోనూ సురేందర్ రెడ్డి సక్సెస్ అయ్యాడు. ప్రేక్షకులు మెచ్చేలా కాదు.. ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించేలా సైరా నరసింహారెడ్డిని తెరకెక్కించాడు. మరే బ్లాక్ బస్టర్ లాంటి సినిమాని తియ్యకపోయినా సురేందర్ రెడ్డి శక్తి మేర సినిమాని ప్రేక్షకులు ఆకట్టుకునేలా తియ్యగలిగాడు. బాహుబలితో రాజమౌళికి ఎంత పేరొచ్చిందో అంత పేరు సురేందర్ రెడ్డికి రాదుకాని తాజాగా అన్ని భాషల హీరోల చూపు ఇప్పుడు ఈ సైరా దర్శకుడు సురేందర్ రెడ్డి మీదే పడింది.

 

Tags:    

Similar News