ఎన్టీఆర్ స్టార్ హీరో కాబట్టి.. కమిట్ అయ్యా

ఎన్టీఆర్ కెరీర్ లో సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన అశోక్ ఎంత పెద్ద డిజాస్టరో అందరికి తెలుసు. అశోక్ డిజాస్టర్ అయితే… ఆ కాంబోలో వచ్చిన [more]

Update: 2019-11-19 08:09 GMT

ఎన్టీఆర్ కెరీర్ లో సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన అశోక్ ఎంత పెద్ద డిజాస్టరో అందరికి తెలుసు. అశోక్ డిజాస్టర్ అయితే… ఆ కాంబోలో వచ్చిన మరో సినిమా ఊసరవెల్లి సినిమాకి ప్రమోహన్స్ లేకపోవడం వలన నిర్మాతకి డబ్బులు రాలేదు. అయితే సై రా నరసింహారెడ్డి సినిమాతో పెద్ద డైరెక్టర్ గా మారిన సురేందర్ రెడ్డి.. ఎన్టీఆర్ తో అశోక్ తీసిన చానళ్లకు.. ఇప్పుడు ఆ సినిమా ఎందుకు తియ్యాల్సి వచ్చిందో.. చెప్పుకుంటున్నాడు. నందమూరి ఫ్యామిలీ హీరో కళ్యాణ్ రామ్ అతనొక్కడే సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన సురేందర్ రెడ్డి తర్వాత కళ్యాణ్ రామ్ చొరవతో ఎన్టీఆర్ తో సినిమా చేసాడు అనే అనుకున్నారు అంతా. కానీ కాదట. ఎన్టీర్ తో సురేందర్ రెడ్డి చేసిన అశోక్ సినిమాని సురేందర్ రెడ్డి ఇష్టపడి చేయలేదట. బలవంతం మీద ఒప్పుకున్నాడట.

ఎన్టీఆర్ మేనేజర్ ఎన్టీఆర్ తో సినిమా చెయ్యాలని.. తన వెంట తిరిగాడని, లేదంటే తానూ ప్రభాస్ తో సినిమా చేసేవాడినని.. ఎన్టీఆర్ మేనేజర్ ఎన్టీఆర్ తో సినిమా చెయ్యాలంటూ ఒత్తిడి తేవడమే కాకుండా తనని అక్కడిక్కడికి తిప్పాడని, అసలు తాను ఎన్టీఆర్ తో సినిమా చేస్తానని చెప్పకుండానే.. ఎన్టీఆర్ తో సినిమా ఎలా చేద్దాం, ఎక్కడ చేద్దామంటూ మాట్లాడడంతో… కాస్త ఇబ్బందిపడినా.. ఎన్టీఆర్ కూడా స్టార్ హీరో కాబట్టి.. తాను ఎన్టీఆర్ తో సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నానని చెబుతున్నాడు.

అయితే అశోక్ కథ తనది కాదని, ఎన్టీఆర్ కోసం అశోక్ కథ వారు ముందే రెడీ చేయించుకున్నారని, ఇక ప్రభాస్ కోసం మరో కథని అనుకున్న తాను ఎన్టీఆర్ కోసమే అశోక్ సినిమా చెయ్యాల్సి వచ్చిందని, అశోక్ కథ తనకి సెట్ అయ్యేది కాకపోయినా.. ఇష్టం లేకుండానే ఆ సినిమా చేసానని చెబుతున్నాడు. మరి నిజంగా ఎన్టీఆర్ అశోక్ కథతో తనకో మాస్ సినిమా చెయ్యమని సురేందర్ రెడ్డి వెంటపడి ఉంటాడా… ? మరి సురేందర్ రెడ్డి చెప్పేది చూస్తుంటే… ఎన్టీఆర్ బలవంతగా ఒప్పించినట్టే కనబడుతుంది.

Tags:    

Similar News