"గూఢచారి"తో సుప్రియా యార్లగడ్డ రీఎంట్రీ

Update: 2018-07-19 13:10 GMT

దాదాపు రెండు దశాబ్ధాల తర్వాత సుప్రియా యార్లగడ్డ మళ్లీ వెండితెరకు "గూఢచారి"తో రీఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో సుప్రియా యార్లగడ్డ పోషిస్తున్న నదియా ఖురేషీ పాత్ర లుక్ ను ఇవాళ విడుదల చేశారు. రా ఏజెన్సీకి కి చెందిన త్రినేత్ర అనే సీక్రెట్ ఏజెన్సీకి వర్క్ చేసే సీక్రెట్‌ ఏజెంట్ గా కనిపించనుంది. సినిమాలో 92 ఎఫ్ ఎస్‌ తుపాకీని క్యారీ చేస్తుంది. ఇటీవల విడుదలైన "గూఢచారి" టీజర్ కి విశేషమైన స్పందన లభించింది. యూట్యూబ్ లో నాలుగు మిలియన్ వ్యూస్ వచ్చాయి. 116 రోజుల పాటు 168 లొకేషన్స్ లో షూట్ చేసిన‌ ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. శశికిరన్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ స్పై థ్రిల్లర్ ను అభిషేక్ పిక్చర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, విస్టా డ్రీమ్ మర్చంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

నటీనటులు:

అడవి శేష్, శోభిత దులిపాళ్ల, ప్రకాష్ రాజ్, మధు షాలిని, అనిష్ కురివెల్ల, సుప్రియ యార్లగడ్డ, వెన్నెల కిషోర్, రాకేష్ వర్రి.

Similar News