ఖాకీ సీక్వెల్ లో సూపర్ స్టార్..!

Update: 2018-10-25 06:39 GMT

గత ఏడాది కార్తీ తమిళంలో నటించిన ఖాకీ సినిమా తెలుగులో కూడా మంచి హిట్ అయ్యింది. హెచ్.వినోద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తమిళం, తెలుగులో మంచి హిట్ గా నిలిచింది. అయితే ఖాకికి తమిళంలో హిట్ టాక్ తో పాటుగా మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి. కానీ తెలుగులో మాత్రం హిట్ టాకొచ్చినపటికి.. కలెక్షన్స్ మాత్రం పూర్ గా ఉన్నాయి. ఈ సినిమాలో పోలీస్ ఇన్స్పెక్టర్ గా కార్తీ ఇరగదీసాడు. కార్తీ హీరోయిన్ రకుల్ ప్రీత్ తో కూడా సినిమా ఫస్ట్ హాఫ్ లో రొమాన్స్ తో ఇరగదీసాడు. మరి తెలుగు, తమిళంలో మంచి టాక్ తెచ్చుకున్న ఈ ఖాకీ సినిమాకి సీక్వెల్ చెయ్యాలనే ప్లాన్లో ఖాకీ యూనిట్ ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి.

సీక్వెల్ కథ రెడీ చేస్తున్న దర్శకుడు

అయితే ఒక సినిమాకి సీక్వెల్ అంటే సహజంగా పార్ట్ 1 లో నటించిన నటీనటులే ఈ సినిమాలోనూ భాగమవుతారు. కానీ ఇక్కడ ఖాకీ సీక్వెల్ హీరో కార్తీ కాదని... హీరో మహేష్ బాబు నటించబోతున్నాడంటూ ప్రచారం మొదలైంది. ఖాకీ సినిమా హిట్ అయినపుడు మహేష్ బాబు డైరెక్టర్ హెచ్.వినోద్ కి ఫోన్ చేసి అభినందించడమే కాదు ఒక మంచి కథ రెడీ చేసుకో అని కూడా చెప్పాడట. మరి ఖాకీ సినిమా నచ్చింది కాబట్టే మహేష్ బాబు ఆ దర్శకుడిని కథని రెడీ చేసుకోమని చెప్పాడంటున్నారు. అందుకే డైరెక్టర్ కూడా ఖాకీ సినిమా ఎలాగూ మహేష్ కి నచ్చింది కాబట్టి.. మళ్లీ అలాంటి కథనే అంటే.. ఖాకీ కి సీక్వెల్ కథనే రెడీ చేసాడట.

ఇప్పట్లో ఖాళీ లేదుగా...

మరి వినోద్ మహేష్ కి ఆ కథ ఎప్పుడు వినిపిస్తాడో... ఆ కథ మెచ్చిన మహేష్ ఈ సినిమాని ఎప్పుడు పట్టాలెక్కిస్తాడో కానీ.. ప్రస్తుతం మహేష్ వంశీ పైడిపల్లి మహర్షి సినిమాతో, సుకుమార్ సినిమాతో, సందీప్ వంగ కి కమిట్ అయ్యి ఉన్నాడు. మరి వినోద్ చెప్పిన కథ నచ్చినా మహేష్ ఇప్పట్లో ఆతనితో సినిమా చేసే ఛాన్స్ అయితే లేదు.

Similar News