పోర్న్ స్టార్ బయోపిక్ వచ్చేస్తుంది

Update: 2018-05-14 10:18 GMT

పోర్న్ స్టార్ సన్నీలియోన్‌ కాదు బాలీవుడ్ నటి సన్నీ లియోన్ జీవిత కథ తెర మీదకు రానుంది. కానీ అది వెండితెర మీదకి కాదు, వెబ్ సిరీస్ గా తెరకెక్కుతోంది. ప్రస్తుతం వెబ్ సిరీస్ ట్రెండ్ నడుస్తోంది. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా వెబ్ సిరీస్ హవా నడుస్తోంది. సన్నీలియోన్‌ జీవితం సినిమాగా చిత్రీకరిస్తే సెన్సార్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అందుకే వెబ్ సిరీస్ వైపు కన్నేశారు మేకర్స్.

ఆమే హీరోయిన్..

ఈ బయోపిక్‌లో సన్ని లియోనే హీరోయిన్ గా యాక్ట్ చేయనుంది. ఈ బయోపిక్‌ను డైరెక్ట్ గా యూట్యూబ్ ఛానల్ లో చూడడం కుదరదు. కొంత డబ్బు కట్టి చూడాలట. లేటెస్ట్ గా ఈ బయోపిక్‌ టీజర్ ను రిలీజ్ చేసారు. ఈ బయోపిక్ కి ‘కరణ్‌జీత్‌ కౌర్‌ ది అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ సన్నీ లియోన్‌’ అనే టైటిల్ పెట్టారు. సన్నీకి చిన్నతనంలో ఎదురైనా అనుభవాలు, సన్ని పోర్న్ ఇండస్ట్రీలోకి ఎందుకు అడుగు పెట్టాల్సొచ్చింది, పోర్న్ స్టార్ గా ఎలా అయింది, అక్కడ నుండి బాలీవుడ్ లోకి ఎందుకు ఎంటర్ అయింది అన్న విషయాలన్నీ ఇందులో స్పష్టంగా చూపించనున్నారు. సన్నీ లియోన్‌ అసలు పేరు కరణ్‌ జీత్‌ కౌర్‌ వోహ్రా.

Similar News