సునీల్ కి లక్కీ ఛాన్స్

చాలాకాలం తరువాత తన సొంత గూటికి చేరాడు కమెడియన్ కం హీరో సునీల్. హీరో గా కొన్ని సినిమాలతో మనని ఎంటర్టైన్ చేసి ఇప్పుడిప్పుడే త‌న‌కు సూట‌య్యే [more]

Update: 2019-06-12 08:26 GMT

చాలాకాలం తరువాత తన సొంత గూటికి చేరాడు కమెడియన్ కం హీరో సునీల్. హీరో గా కొన్ని సినిమాలతో మనని ఎంటర్టైన్ చేసి ఇప్పుడిప్పుడే త‌న‌కు సూట‌య్యే కామెడీ వేషాలు వేసుకుంటున్నాడు సునీల్‌. టాలీవుడ్ లో వరస అవకాశాలతో బిజీ అవుతున్న సునీల్ హీరో గా కూడా అవకాశాలు వస్తున్నాయి. అయితే సునీల్ మాత్రం ఏమాత్రం తొందర పడకుండా వాటిని రిజెక్ట్ చేస్తున్నాడు.

అయితే మనోడికి అనుకోకుండా బాలీవుడ్ నుండి ఆఫర్ వచ్చింది.అక్క‌డ రూపొందే ఓ మ‌ల్టీస్టార‌ర్ చిత్రంలో సునీల్‌కి ఛాన్సొచ్చింది. ఈమూవీని అక్కడ తాతినేని ప్ర‌సాద్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తారు. ఇందులో స‌న్నీలియోన్‌, బ్ర‌హ్మానందం లాంటి స్టార్లు కూడా ఉన్నారు. అలానే ఇద్దరు ముగ్గురు బాలీవుడ్ క‌మిడియ‌న్ హీరోలు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లు పోషిస్తార‌ని స‌మాచారం.

సునీల్ కూడా ఎప్పటినుండో బాలీవుడ్ లో సినిమా చేయాలనీ చూస్తున్నాడు. కానీ కుదరడం లేదు. ఇన్నాళ్లకు మంచి ఆఫర్ రావడంతో వెంటనే ఓకే చెప్పినట్టు టాక్. అయితే ఈమూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఇంకా అధికారంగా ప్రకటించలేదు. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముందని తెలుస్తుంది

Tags:    

Similar News