మళ్లీ పాత సునీల్ కనిపిస్తాడా..?

ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సునీల్ తరువాత హీరోగా ఛాన్స్ రావడంతో అక్కడి నుండి హీరో పాత్రలే చేయడం స్టార్ట్ చేసాడు. [more]

Update: 2019-03-15 07:22 GMT

ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సునీల్ తరువాత హీరోగా ఛాన్స్ రావడంతో అక్కడి నుండి హీరో పాత్రలే చేయడం స్టార్ట్ చేసాడు. అయితే స్టార్టింగ్ లో కొంచం కెరీర్ పర్లేదు అనిపించినా తరువాత వరుసగా ఫ్లాప్ లు చవిచూస్తూ వచ్చాడు. దీంతో సునీల్ మళ్లీ కామెడీ వేషాలు వేయాలని డిసైడ్ అయిపోయాడు. అందుకే లేటెస్ట్ గా సాయి ధరమ్ తేజ్ హీరోగా వస్తున్న చిత్రలహరి చిత్రంలో కమెడియన్ పాత్ర చేస్తున్నాడు. కిషోర్ తిరుమల కాంబినేషన్ లో రూపొందిన చిత్రలహరి టీజర్ తాజాగా రిలీజ్ అయింది.

ఈ సినిమా హిట్ అయితేనే…

టీజర్ లో షాట్స్ చూస్తుంటే సునీల్ ఈసారి తన సత్తా చాటుతాడేమో అనిపిస్తుంది. ఇందులో సునీల్ ది కాస్త అమాయకత్వం కూడిన పాత్రలా అనిపిస్తుంది. సినిమాలో నాలుగు పాత్రలు ఉంటే అందులో సునీల్ ది ఒక పాత్ర. ఈ మూవీతో సునీల్ కమెడియన్ గా మళ్లీ ఫామ్ లోకి వస్తాడని ప్రేక్షకులు భావిస్తున్నారు. అలా కాకుండా మూస తరహాగానే సునీల్ కనిపిస్తే మాత్రం ఆయన కెరీర్ మెల్లిగా డౌన్ ఫాల్ అవుతున్నట్లుగా భావించవచ్చు. కాబట్టి ఈ సినిమాలో తన పాత్ర హైలైట్ అవ్వడం సునీల్ కి చాలా అవసరం.

Tags:    

Similar News