సునీల్ కామెడీ ఎలా ఉంది..?

Update: 2018-10-12 06:26 GMT

కమెడియన్ గా పీక్ స్టేజి లో ఉన్న సునీల్ హీరోగా టర్న్ అయ్యాడు. మొదట్లో రాజమౌళి లాంటి దర్శకుడి అండ దొరికిన సునీల్ తర్వాత మాత్రం హీరోగా సరిగ్గా నిలబడలేకపోయారు. అయితే తాను మళ్లీ సినిమాల్లో కమెడియన్ వేషాలెయ్యాలి అంటే... త్రివిక్రమ్ లాంటి ఫ్రెండ్ ఉన్నాడులే అనే ధీమాతో సునీల్ ఉన్నాడనే విషయం ఈ మధ్య జరిగిన అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పాడు. ఇక హీరోగా డల్ అయిన టైంలో సునీల్ మళ్ళీ కమెడియన్ గా రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవడం... అదే టైం లో సునీల్ ఆప్త మిత్రుడు త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో అరవింద సమేత ప్రాజెక్ట్ మొదలు పెట్టడం.. అందులో సునీల్ కి మంచి పాత్ర ఇవ్వడం జరిగాయి. అయితే ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న కథలో ఎలాంటి కామెడీతో త్రివిక్రమ్ అద్భుతాలు చేస్తాడో అని అనుకున్నారు. అయితే సునీల్ చెప్పిన కథతో మొదలైన అరవింద సమేతలో నీలాంబరి గా సునీల్ కి మంచి పాత్రే దక్కింది.

మంచి పాత్ర ఇచ్చిన త్రివిక్రమ్...

అయితే అరవింద లో ఎమోషనల్ గా సునీల్ బాగా మెప్పించాడు. కానీ కథలో కామెడీకి చోటు లేకపోవడంతో సునీల్ కి ఎక్కువగా కామెడీ చేసే అవకాశం మాత్రం దక్కలేదు. నీలాంబరిగా, వీర రాఘవకు (ఎన్టీఆర్) స్నేహితుడిగా మంచి మార్కులే సంపాదించాడు. కామెడీకి దూరంగా కథలో భాగమయ్యడు సునీల్. అయితే ఈ తరహా పాత్రలతో డిస్టెన్స్‌ ఏర్పడినా కానీ కమెడియన్‌గా ఇంకా ఫామ్‌లోనే వున్నాడనేది ఈ అరవింద సమేత తో క్లారిటీ వచ్చేస్తుంది. ఇక ఈ సినిమాతో సునీల్ తన పాత దారిలోకి వచ్చేసాడు. ఇకపై హీరోగా వచ్చే ఛాన్స్ లేదని కూడా మనం ఫిక్స్ అవ్వోచ్చేమో. ఇక అరవింద సమేతలో నిజంగానే త్రివిక్రమ్ సునీల్ కి మంచి పాత్ర ఇచ్చి ఆదుకున్నాడనే చెప్పాలి. ఈ సినిమాతో సునీల్ కి మళ్లీ పెద్ద సినిమాల్లో కమెడియన్ లేదా కేరెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు కానీ రావడం మాత్రం ఖాయం.

Similar News