హీరోయిజం మీద ఇంకా మమకారం పోలా..!

Update: 2018-09-04 08:02 GMT

ప్రస్తుతం హీరో నుండి యూటర్న్ తీసుకుని సునీల్ కమెడియన్ గా రెండు పెద్ద ప్రాజెక్టులలో బిజీ అయ్యాడు. కమెడియన్ గా పీక్ స్టేజ్ లో ఉన్న సునీల్ హీరోగా మారాడు. రాజమౌళి వంటి దర్శకుడు సునీల్ ని ఎంకరేజ్ చేస్తే సునీల్ మాత్రం ఎందుకూరుకుంటాడు. అందుకే హీరోగా వరసబెట్టి సినిమాలు చేసుకుంటూ పోయాడు. కానీ రాజమౌళి ఇచ్చిన మర్యాదరామన్న లాంటి హిట్ మళ్లీ సునీల్ కి పడలేదు. కానీ హీరోగా మారాక మళ్లీ కమెడియన్ గా ఎందుకులే అనుకుని వచ్చిన సినిమాలు హీరోగా చేస్తూపోయాడు. కానీ వరస వైఫల్యాలతో హీరోయిజాన్ని వదలక తప్పలేదు. ఇండస్ట్రీలో కొన్నాళ్లు ఉండాలి అనుకుంటూ మళ్లీ కమెడియన్ గా అవతారమెత్తాడు.

సిల్లీ ఫెలోస్ తర్వాత...

కమెడియన్ గా సినిమాలు చేస్తున్నప్పటికీ మరోపక్క హీరోయిజం మీద ఆశ చావక ఆ ప్రయత్నాలూ చేసుకుపోతున్నాడు సునీల్. అరవింద సమేత వీర రాఘవ సినిమాలో ఎన్టీఆర్ పక్కన ఉండే కేరెక్టర్ చేస్తున్న సునీల్, రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీలో కడుపుబ్బా నవ్వించే కమెడియన్ గా నటిస్తున్నాడు. ప్రస్తుతం అల్లరి నరేష్ తో కలిసి నటించిన సిల్లీ ఫెలోస్ శుక్రవారం విడుదలకు సిద్దమవుతుంది. అయితే ఈ సినిమాలో సునీల్ వన్ అఫ్ ది హీరో కాదంట. అల్లరి నరేష్ కి సపోర్టింగ్ కేరెక్టర్ అంటున్నారు. మరి అల్లరి పెద్దగా ఫామ్ లో లేడు. ఇలాంటి టైం లో వస్తున్న సిల్లీ ఫెలోస్ సునీల్ ని ఏ మాత్రం హైలెట్ చేస్తుందో కానీ.. ప్రస్తుతం హీరోగా సునీల్ మరో సినిమా మొదలెట్టబోతున్నాడట.

వెలిగొండ దర్శకత్వంలో...

రైటర్ వెలిగొండ శ్రీ‌నివాస్ డైరెక్షన్ లో సునీల్ న‌టించ‌బోతున్నాడ‌ని ఫిలింనగర్ టాక్. ఎన్నో మాస్‌, క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌కు క‌థలు అందించిన వెలిగొండ... రాజ్ త‌రుణ్‌ అంధ‌గాడుతో ద‌ర్శ‌కుడిగా అవ‌తారం ఎత్తాడు. అయితే ఆ సినిమా కాస్త ఫర్వాలేదనిపించింది. ఇక ఆ సినిమా తర్వాత సునీల్ కోసం ఒక క‌థ రాసుకున్నాడ‌ట‌. అది సునీల్‌కి న‌చ్చ‌డం.... వెలిగొండకి ఓకే అనడం కూడా జరిగిందనే టాక్ నడుస్తుంది. మరి కమెడియన్ గా మారుతున్న ఈ తరుణంలో మళ్లీ హీరో వేషాలంటూ బయలుదేరితే... ఇప్పుడొస్తున్న కమెడియన్ వేషాలు పొతే మాత్రం సునీల్ కి దెబ్బే. కాస్త ఆలోచించుకోవయ్యా సునీలు అంటున్నారు సునీల్ అభిమానులు.

Similar News