సునీల్ కు మంచి ఛాన్స్ దక్కిందట..!

కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన సునీల్ ఆ తరువాత హీరోగా ఛాన్స్ రాగా అటు వెళ్లిపోయే కమెడియన్ పాత్రలకు దూరం అయ్యాడు. ఇప్పుడు మళ్లీ కమెడియన్ పాత్రలు [more]

Update: 2019-04-15 08:31 GMT

కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన సునీల్ ఆ తరువాత హీరోగా ఛాన్స్ రాగా అటు వెళ్లిపోయే కమెడియన్ పాత్రలకు దూరం అయ్యాడు. ఇప్పుడు మళ్లీ కమెడియన్ పాత్రలు చేయడానికి వచ్చాడు. అరవింద సమేత సినిమాతో రీఎంట్రీ ఇచ్చాక సునీల్ కెరీర్ కాస్త గాడిలో ప‌డిన‌ట్టే క‌నిపిస్తోంది. అరవిందలో కామెడీ చేయకపోయినా మంచి పాత్ర చేశాడు సునీల్. రీసెంట్ గా చిత్రలహరి సినిమాతో కూడా ఆక‌ట్టుకుంటున్నాడు. తేజూకి ‘గ్లాస్ మేట్‌’గా క‌నిపించి.. మంచి మార్కులు అందుకున్నాడు. ప్రస్తుతం సునీల్ చేతిలో మూడు పెద్ద సినిమాలు ఉన్నాయి.

కల నెరవేరుతోందట…

అతడి మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేస్తున్న కొత్త సినిమాతో పాటు రవితేజ డిస్కో రాజాలో కూడా సునీల్ న‌టిస్తున్నాడు. అలానే మెగాస్టార్ చిరంజీవి – కొరటాల కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో కూడా సునీల్ కి ఛాన్స్ దొరికిన‌ట్టు స‌మాచారం. ఈ విషయాన్ని సునీల్ ప‌రోక్షంగా ప్ర‌స్తావించాడు. ‘‘నేను ఎప్ప‌టి నుంచో అనుకుంటున్న క‌ల తీర‌బోతోంది. త్వ‌ర‌లో ఓ పెద్ద సినిమాలో, ఓ పెద్ద హీరోతో క‌ల‌సి న‌టించ‌బోతున్నా. ఆ హీరో ఎవ‌ర‌న్న‌ది మీ ఊహ‌కే వ‌దిలేస్తున్నా” అంటూ హింట్ ఇచ్చాడు సునీల్‌. అలానే హీరోగా ఎలాంటి సినిమాలు ఒప్పుకోద‌ల‌చుకోలేదు అని క్లారిటీ ఇచ్చేశాడు.

Tags:    

Similar News