ఫ్రెండ్ ని ములగచెట్టెక్కిస్తున్నాడు..!

త్రివిక్రమ్, సునీల్ ఇద్దరూ మంచి స్నేహితులు. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో కెరీర్ లో స్థిరపడక ముందు ఇద్దరూ కలిసి ఒకే రూమ్ లో ఉండేవారు. ప్రస్తుతం ఒకరు [more]

Update: 2019-04-22 07:01 GMT

త్రివిక్రమ్, సునీల్ ఇద్దరూ మంచి స్నేహితులు. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో కెరీర్ లో స్థిరపడక ముందు ఇద్దరూ కలిసి ఒకే రూమ్ లో ఉండేవారు. ప్రస్తుతం ఒకరు నటుడిగా, ఒకరు డైరెక్టర్ గా సత్తా చాటుతున్నారు. ఇక త్రివిక్రమ్ సినిమాలో సునీల్ కి కమెడియన్ గా మంచి క్యారెక్టర్స్ ఉండేవి. కానీ సునీల్ హీరోగా ప్లాప్ అయ్యాక.. ఎక్కడ తిరిగినా నా ఫ్రెండ్ నాకు ఏదో ఒక క్యారెక్టర్ ఇస్తాడనే నమ్మకం ఉంది అని సునీల్ చెప్పినట్టుగానే… హీరోగా ఫెయిల్ అయ్యాక సునీల్ కు త్రివిక్రమ్ అరవింద సమేతలో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. తాజాగా అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ చెయ్యబోయే సినిమాలోనూ సునీల్ కి త్రివిక్రమ్ మంచి క్యారెక్టర్ ఇచ్చాడనే ప్రచారం జరుగుతుంది.

ఆకాశానికెత్తేసిన సునీల్

మరి అంత ఆదుకుంటున్న తన ఫ్రెండ్ ని సునీల్ మునగ చెట్టు ఎక్కించేస్తున్నాడు. చిత్రలహరి విజయంతో కాస్త కోలుకున్న సునీల్ ఒక ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ గురించి మట్లాడుతూ.. తాము రూంలో కలిసి ఉండేటప్పుడు త్రివిక్రమ్ చాలా కథలను రాసుకున్నాడని, అందులో త్రివిక్రమ్ కనీసం సగం కూడా వాడలేదని చెబుతున్నాడు. తనకి త్రివిక్రమ్ ఆ కథలను వినిపించేవాడిని చెప్పిన సునీల్.. ఆ కథల్లో 500 కోట్ల బడ్జెట్ ఉన్న కథ కూడా ఉందట. అప్పట్లో 500 కోట్ల బడ్జెట్ కి కథ రాసిన త్రివిక్రమ్ ఇప్పుడు గనుక అదే కథతో సినిమా తియ్యాల్సి వస్తే… 2000 కోట్ల బడ్జెట్ పెట్టాల్సి వస్తుందని చెప్పాడు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదుగుతాడని అనుకున్నానని.. రెండు మూడు సినిమాలకే బాలీవుడ్ కి వెళ్లిపోయే టాలెంట్ త్రివిక్రమ్ కి ఉందని.. స్నేహితుణ్ని చెట్టెక్కించేస్తున్నాడు సునీల్.

Tags:    

Similar News