సునీల్ పయనం ఎటువైపు....?

Update: 2018-10-14 04:17 GMT

'నువ్వే కావాలి' మొదలు 'అందాల రాముడు'లో హీరో కాకముందు వరకు సునీల్ తన కామెడీతో కామెడీ టైమింగ్ తో టాలీవుడ్ ను ఒక ఊపు ఊపేసాడు. మరి ఏమంటూ... అందాల రాముడు సినిమా నుండి హీరో గా చేయడానికి ముందుకు వెళ్ళాడో అప్పటి నుండి హీరోగా సునీల్ ఫెయిల్ అవుతూనే వచ్చాడు. మొన్న సిల్లీ ఫెలోస్ దాకా హీరోగా సునీల్ సినిమా చేసాడు. ఇక రీసెంట్ గా తన ఫ్రెండ్ డైరెక్షన్ లో ఓ ఇంట్రెస్టింగ్ పాత్ర ఒకటి చేశాడు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో సునీల్ అరవింద సమేత నీలాంబరి పాత్ర చేశాడు.

చాలా నార్మల్ గా.....

పాత్ర కథ పరంగా ఎన్టీఆర్ కు ఆశ్రయమిచ్చి కీలక మలుపుకు దోహదపడేదే అయినా త్రివిక్రమ్ తన స్నేహితుడిని ఏమంత గొప్పగా చూపించలేకపోయారు. చాలా నార్మల్ గా కనిపించాడు సునీల్. నిజానికి సునీల్ మంచి కామెడీ టైమింగ్. అతని పాత సినిమాలు చూసుకుంటే మనకే అర్ధం అవుతుంది. కమెడియన్ గా రీఎంట్రీ ఇచ్చి అదరకొడతాడు అనుకుంటే నీలాంబరి పాత్రతో తుస్ మనిపించాడు.

టీవీ షో చేసేందుకు.....

క్యారక్టర్ ఆర్టిస్ట్ గా సునీల్ ఎంతో కాలం సెట్ అయ్యేలా కనిపించడం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగడం అంత ఈజీ కాదు. మరోవైపు సునీల్ ఆలీ తరహాలో ఒక టీవీ షో ప్లాన్ చేసే ఆలోచనలో ఓ ఛానల్ ఉన్నట్టు తెలిసింది. ఒకవేళ అదే జరిగితే సునీల్ ను ఇంకా పూర్తి స్థాయిలో సినిమాల్లో చూడలేం. కానీ సునీల్ అంత ఈజీగా సినిమాలని వదులుకోరు. మరి ఎటు వైపు మగ్గుతాడో వేచి చూడాలి.

Similar News