సునీల్ మళ్లీ బిజీ అవుతున్నాడా..?

Update: 2018-10-31 07:07 GMT

హీరోగా అవకాశాలు అటకెక్కాక మళ్లీ కమెడియన్ గా సునీల్ పాత ఫామ్ ని అందుకోవాలని ఆరాట పడుతున్నారు. హీరోగా సక్సెస్ లు దూరమయ్యాక గానీ తనకి కమెడియన్ విలువ అర్ధమైనట్టుగా లేదు. అందుకే తన పాత పంథాలోకి మారిపోయాడు. అరవింద సమేతలో నీలాంబరిగా చాలా తక్కువ కామెడీ(కథలో కామెడీ ఉన్నది కొంచమే కాబట్టి) చేసిన సునీల్ కి ఆ సినిమా పెద్దగా పేరు తీసుకురాలేదు. స్నేహితుడు త్రివిక్రమ్ కూడా సునీల్ కి తగిన కేరెక్టర్ ఇవ్వలేకపోయాడు. మరి అరవింద సమేత సినిమా ఒక సీరియస్ నెస్ తో కూడిన కథ కాబట్టి ఆ సినిమాలో సునీల్ కామెడీ చూడలేకపోయాం. ఇక మరో స్నేహితుడు శ్రీను వైట్ల, సునీల్ కి ఎలాంటి కామెడీ కేరెక్టర్ ఇచ్చాడట. అమర్ - అక్బర్ అంటోనీ సినిమాలో సునీల్ పూర్తిస్థాయి కమెడియన్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమా మీద భారీ ఆశలే పెట్టుకున్న సునీల్ మెల్లిగా బిజీగా మారుతున్నాడు.

మరో సినిమాలోనూ...

అరవింద అన్యాయం చేసినా... అమర్ అక్బర్ న్యాయం చేస్తుందనే నమ్మకంతో సునీల్ ఉన్నాడు. తాజాగా రవితేజ మరో మూవీలోనూ సునీల్ అవకాశం దక్కించుకున్నాడనే న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో వినబడుతుంది. ర‌వితేజ - వీఐ ఆనంద్ కాంబోలో ఒక సినిమా రాబోతుంది. డిస్కో రాజాగా కొత్త కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సునీల్‌కి ఓ కీల‌క‌మైన పాత్ర ద‌క్కింది. ర‌వితేజ రిక‌మెండేష‌న్‌తోనే సునీల్‌కి ఈ ఛాన్స్ వ‌చ్చింద‌ని ఇండ్ర‌స్ట్రీ టాక్. అయితే అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో సునీల్ పాత్ర సూపర్ గా వచ్చిందని అందుకని రవితేజ మరోసారి తన సినిమాలో ఛాన్స్ ఇప్పించాడని అంటున్నారు. త్వరలోనే రవితేజ - వీఐ ఆనంద్ కాంబో మూవీ మొదలు కాబోతుంది.

Similar News