సినీ నటుడు అంబరీష్ కన్నుమూత

Update: 2018-11-25 04:52 GMT

కాంగ్రెస్ సీనియర్ నేత, కన్నడ సూపర్ స్టార్ అంబరీష్ గత రాత్రి కన్ను మూసారు. మాజీ హీరోయిన్ సుమలత భర్త అయిన అంబరీష్ గుండెపోటుతో బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మైసూర్‌ రాష్ట్రంలోని మాండ్యలోని దొడ్డరసినకెరెలో 1952 మే 29న హుచ్చే గౌడా, పద్మావతమ్మ దంపతులకు జన్మించిన ఆయన అనేక తెలుగు సినిమాల్లోనూ నటించారు. అంబరీష్ - సుమలత దంపతులకు ఒక కుమారుడు అభిషేక్‌ గౌడ ఉన్నారు. కన్నడ రెబల్‌ స్టార్‌గా పేరుతెచ్చుకున్న దాదాపుగా 200 చిత్రాల్లో నటించారు. అయితే గత కొంతకాలంగా కిడ్నీ, శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నఅంబరీష్ గత రాత్రి గుండెపోటు రావడంతో మరణించారు.

సుమలతను వివాహమాడడం, రాజకీయాల్లో అంబరీష్ మన్మోహన్‌ సింగ్‌, సిద్దరామయ్య మంత్రివర్గంలోనూ మంత్రిగా కూడా పనిచేశారు. అనారోగ్య కారణాల చేత గత ఎన్నికల నుండి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అంబరీష్ మృతికి టాలీవుడ్ కోలీవుడ్, కన్నడ ప్రముఖులంతా సంతాపం తెలుపుతున్నారు

Similar News