హమ్మ సుమా..ఆమె అంటే అంత అసూయ ఎందుకు!!

టాలీవుడ్ టాప్ యాంకర్ ఎవరయ్యా అంటే టక్కున సుమా కనకాల అని చెబుతారు. అదే టాలీవుడ్ హాట్ యాంకర్ అనగానే అనసూయ అనే చెబుతారు. టాలీవుడ్ లో [more]

Update: 2020-07-15 07:02 GMT

టాలీవుడ్ టాప్ యాంకర్ ఎవరయ్యా అంటే టక్కున సుమా కనకాల అని చెబుతారు. అదే టాలీవుడ్ హాట్ యాంకర్ అనగానే అనసూయ అనే చెబుతారు. టాలీవుడ్ లో సుమా యాంకరింగ్ అంటే చిన్న పెద్ద అందరూ చెవి కోసుకుంటురు. స్పాంటినియస్ గా మాట్లాడడం అందరిని అల్లరి చేస్తూ అట పట్టించడంలో సుమ కనకాల ముందుంటుంది. అనసూయ మాత్రం హాట్ గా అందంగా అందరిని ఆకర్షిస్తుంది. అయితే ఇప్పుడు సుమా కనకాల కి టాలీవుడ్ లో ఓ యాంకర్ అంటే అసూయ, కుళ్ళు అని చెప్పఁడం చూస్తుంటే అందరికి ఆశ్చర్యం వేస్తుంది. తాజాగా సుమా కనకాల అలీ తో జాలిగా ప్రోగ్రాం కి  రాగా అక్కడ అలీ సుమని మీకు ఏ యాంకర్ ని చూస్తే అసూయ కలుగుతుంది, ఎవరిని చూస్తే కుళ్ళు కలుగుతుంది అని అడగగా.. సుమా ఏం వెతుక్కోకుండా సమాధానం చెప్పింది.

తనకి అనసూయ ని చూస్తే అసూయ కలుగుతుంది అని చెప్పి అందరికి షాకిచ్చింది. అనసూయ ని చూస్తే కుళ్ళు అని కూడా చెప్పింది. ఎందుకు తనకి అనసూయ ని చూస్తే కుళ్ళు, ఆసుయ కలుగుతాయో చెప్పు కొచ్చింది. ఎందుకంటే అనసూయ హైట్ చూస్తుంటే నిజంగానే కుళ్లు వస్తుందని.. అందం చూస్తుంటే అమ్మాయిగా తనకు అనసూయ ని చూస్తే అసూయ అనేది కలుగుతుందని చెబుతుంది. అయితే ఎవరిని చూసినా కలగని అసూయ ఒక్క అనసూయ ని చూస్తేనే కలుగుతుంది అని చెబుతుంది సుమ. అంతేకాకుండా ఒకే ప్రొఫెషన్ లో ఉన్నప్పుడు మనకన్నా ఎక్కువ సంపాదించినా , మనకన్నా బావున్నా సహజంగానే కుళ్ళు వస్తుంది అని.. అనసూయని చూస్తే తనకి ఆ ఫీలింగ్ వస్తుంది అని చెప్పి అందరికి షాకిచ్చింది. ఇక సుమ ఎంత ఫన్నీగా చెప్పినా ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం సుమకి అనసూయ అంటే కుళ్ళంత! సుమకి అనసూయ అంటే అసూయట! అంటూ స్ప్రెడ్ చేస్తున్నారు.

Tags:    

Similar News