సుక్కు నెక్స్ట్ హీరో అతనేనా?

సుకుమార్ రంగస్థలం తర్వాత చాలా గ్యాప్ తీసుకుని అల్లు అర్జున్ తో ఎర్రచందనమ్ స్మగ్లింగ్ నేపథ్యంలో ఓ సినిమాని పట్టాలెక్కించాడు. ఒక షెడ్యూల్ కంప్లీట్ అయ్యాక అల్లు [more]

Update: 2020-04-05 15:56 GMT

సుకుమార్ రంగస్థలం తర్వాత చాలా గ్యాప్ తీసుకుని అల్లు అర్జున్ తో ఎర్రచందనమ్ స్మగ్లింగ్ నేపథ్యంలో ఓ సినిమాని పట్టాలెక్కించాడు. ఒక షెడ్యూల్ కంప్లీట్ అయ్యాక అల్లు అర్జున్ ఇంకా సెట్స్ మీదకి వెళ్లకముందే కరోనా కారణంగా ఈ సినిమాకి బ్రేకులు పడ్డాయి. అయితే అల్లు అర్జున్ తో ఈ సినిమా అయ్యాక సుకూంర్ నెక్స్ట్ సినిమా హీరోపై అప్పుడే సోషల్ మీడియాలో ఆసక్తి మొదలయ్యింది.

అయితే సుకుమర్ ఫస్ట్ హీరో రామ్ తో సుకుమార్ నెక్స్ట్ మూవీ ఉండబోతుంది అనే టాక్ వినబడుతుంది. రామ్ – సుక్కు కాంబో లో చాలా ఏళ్ళ క్రితం జగడం సినిమా తెరకెక్కింది. అయితే ఆ సినిమా అప్పట్లో ప్లాప్ అయ్యింది. ఆ తర్వాత రామ్ సోలో గాను.. సుకుమార్ స్టార్ డైరెక్టర్ గాను ఎదిగారు కానీ.. ఆ కాంబో ఇంతవరకు రిపీట్ కాలేదు. కానీ తాజాగా మరోసారి ఈ కాంబో రిపీట్ అవుతుంది అని అంటున్నారు. కరోనా కాణంగా అల్లు అర్జున్ సినిమా ని పక్కనబెట్టి సుకుమర్.. రామ్ కి ఒక కథ వినిపించడం.. సుక్కు చెప్పిన కథ చాలా కొత్తగా ఉందంటూ సుకుమార్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయిందట. అల్లు అర్జున్ సినిమా పూర్తి కాగానే సుక్కు రామ్ తో సెట్స్ మీదకెళ్తాడట. రామ్ ఈమధ్యనే ఇస్మార్ట్ తో భారీ హిట్ కొట్టాడు. తాజాగా రెడ్ మూవీలో నటిస్తున్నాడు.

Tags:    

Similar News