సుకుమార్ ని అలా లాక్ చేసారా?

సుకుమార్ కి రంగస్థలం లాంటి భారీ హిట్ పడినా.. ఆయనతో సినిమా చేసేందుకు మహేష్ తెగ ఆలోచించాడు. సుకుమార్ తో కమిట్ అయిన మూవీ ని క్రియేటివ్ [more]

Update: 2020-09-30 05:48 GMT

సుకుమార్ కి రంగస్థలం లాంటి భారీ హిట్ పడినా.. ఆయనతో సినిమా చేసేందుకు మహేష్ తెగ ఆలోచించాడు. సుకుమార్ తో కమిట్ అయిన మూవీ ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వలన పక్కనపెట్టేశారు మహేష్. ఆ సినిమా కథతోనే సుకుమార్ అల్లు అర్జున్ ని పడేసాడు. అయితే సుక్కు అల్లు అర్జున్ చెప్పిన కొన్ని విషయాలకు తలొగ్గాడు కాబట్టే ఆ ప్రాజెక్ట్ పాన్ ఇండియా లెవల్ కి వెళ్ళింది. కొన్ని విషయాలంటే.. సుక్కు ఓన్ బ్యానేర్ లాంటి మైత్రి మూవీస్ తో తన చుట్టాలు కూడా నిర్మాతలుగా కలవడం, అలాగే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్ కి మార్పులు చెయ్యమని చెప్పడం. ఇక సుకుమర్ అల్లు అర్జున్ కండిషన్స్ కి ఒప్పుకున్నా.. కొన్ని విషయాల్లో తన పంతం నెగ్గించుకున్నాడు.

అయితే తాజాగా సుకుమార్ – విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్ తెరపైకి వచ్చి అందరిని ఆశ్చర్యంలో పడేసింది. అసలు ఎప్పుడు ఎక్కడా.. వాడుకలో లేని కాంబో. అయితే సుకుమార్ తో విజయ్ దేవరకొండ సినిమా కమిట్ చేయించాడు. ఇక్కడ సుకుమార్ ని విజయ్ దేవరకొండ తన ఫ్రెండ్ తో కలిసి భారీ పారితోషకానికి పడేసాడనే టాక్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. అల్లు అర్జున్ తర్వాత తన మూవీని పాన్ ఇండియా లెవల్లో చెయ్యడానికి సుకుమార్ కి తన ఫ్రెండ్, నిర్మాత అయినా కేదర్ తో 10 కోట్ల అడ్వాన్స్ ఇప్పించాడట. ఇక పారితోషకం కూడా భారీ లెవల్లో ఉండబోతుందట.

అందుకే సుకుమార్ కూడా తన సొంత నిర్మాణ సంస్థలా మెలిగిన మైత్రి మూవీస్ నుండి బయటికి వచ్చేసాడనే టాక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 2022 లో మొదలు కాబోయే సినిమాకి ఇప్పుడు 10 కోట్ల అడ్వాన్స్ అంటే సుక్కు దశ తిరిగినట్టే. అందులోను స్టార్ ఇమేజ్ ఉన్న విజయ్ దేవరకొండ తో పాన్ ఇండియా లెవల్ మూవీ అంటే మాటలు కాదు. సో అందుకే మైత్రి వారిని సుక్కు పక్కనపెట్టేసాడనే టాక్ మాత్రం స్ప్రెడ్ అయ్యింది.

Tags:    

Similar News