పుష్పలో తెలుగు హీరోయిన్ కావాలన్న బన్నీ

పుష్ప లాంటి పాన్ ఇండియా ఫిలిం లో ఏ బాలీవడో హీరోయిన్ నో తీస్కోకుండా రెండు భారీ హిట్స్ ఉన్న రశ్మికని హీరోయిన్ గా తీసుకోవడం చాలామందికి [more]

Update: 2021-03-08 09:50 GMT

పుష్ప లాంటి పాన్ ఇండియా ఫిలిం లో ఏ బాలీవడో హీరోయిన్ నో తీస్కోకుండా రెండు భారీ హిట్స్ ఉన్న రశ్మికని హీరోయిన్ గా తీసుకోవడం చాలామందికి నచ్ఛలేదు. అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో రష్మిక ఛాన్స్ కొట్టేసింది. పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతున్న పుష్ప సినిమాకి రష్మిక క్రేజ్ సరిపోతుందా అని పెదవి విరచినవారూ లేకపోలేదు. అప్పటికి రష్మిక బాలీవుడ్ మూవీస్ ఒప్పుకోలేదు. కేవలం తెలుగు, తమిళ్ మూవీస్ చేసిన రశ్మికని సుకుమార్ పాన్ ఇండియా లెవల్ కి తీసుకెళ్ళబోతున్నాడు.. పాప బాగా లక్కీగా అనుకున్నారు. అసలైతే పుష్ప లో రష్మిక ని హీరోయిన్ గా ముందు అనుకోలేదట. అల్లు అర్జున్ సుకుమార్ కి ఫోన్ చేసి ఓ తెలుగమ్మాయిని పుష్ప లో హీరోయిన్ గా తీసుకుందామని చెప్పాడట. దానికి సుకుమార్ కూడా షాకయ్యాడట. అంత పెద్ద హీరో తెలుగమ్మాయిని హీరోయిన్ గా తీసుకుందామని అడగడం సామాన్యమైన విషయం కాదని.

అనుకోకుండా కొన్ని తప్పని పరిస్థితుల్లో పుష్ప సినిమాలోకి రష్మికాని తీసుకోవాల్సి వచ్చింది అని ఓ ఈవెంట్ లో సుకుమార్ చెబుతున్న మాట. తన సినిమాల్లో తెలుగు రాని హీరోయిన్స్ ని పెట్టుకుని చాలా ఇబ్బంది పడ్డా అని, రంగస్థలం సినిమాలో చూస్తే సమంత, ప్రకాష్ రాజ్ తప్ప మిగతా వారంతా తెలుగు వారే అని, కానీ ప్రకాష్ రాజ్, సమంత చాలా బాగా తెలుగు మాట్లాడతారని అందుకే వాళ్ళని తీసుకున్నాడట సుకుమార్. పర భాషా హీరోయిన్స్ తెలుగు డైలాగ్స్ చెప్పేటప్పుడు ఎంత ఇబ్బంది పడతారో తనకి తెలుసు అని, ఇకపై తన సినిమాల్లో తెలుగు హీరోయిన్స్ కి చోటుంటుంది అని ఆ ఈవెంట్ లో చెప్పుకొచ్చాడు సుకుమార్.

Tags:    

Similar News