సుకుమార్ ను భయపెడుతున్న ‘రంగస్థలం’..!

రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ తరువాత సుకుమార్ ఎటువంటి జోనర్ లో సినిమా తీస్తాడు? అని చాలామంది ఎదురు చూస్తున్నారు. వారి అంచనాలు నిలబెట్టుకునేందుకు సుక్కు చాలా [more]

Update: 2019-02-05 06:46 GMT

రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ తరువాత సుకుమార్ ఎటువంటి జోనర్ లో సినిమా తీస్తాడు? అని చాలామంది ఎదురు చూస్తున్నారు. వారి అంచనాలు నిలబెట్టుకునేందుకు సుక్కు చాలా ప్రయతిస్తున్నాడు. ప్రస్తుతం సుకుమార్ మహేష్ తో 26 చిత్రాన్ని తీయనున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా స్టోరీ ఏంటో ఇంతవరకు క్లారిటీ రాలేదు. కాగా రీసెంట్ గా ఇది అక్రమ రవాణా చేసే మాఫియా నేపథ్యంలో సాగే కథ అని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతరకు నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం సుక్కు స్క్రిప్ట్ విషయంలో తర్జనభర్జన పడుతున్నారట.

మహేష్ పాత్రపై కసరత్తు

ప్రధానంగా మహేష్ క్యారెక్టరైజేషన్ కోసం ఎక్కువగా కసరత్తు చేస్తున్నారు. ఆయన పాత్రకు సంబంధించి రెండు మూడు రకాలుగా సుక్కు అనుకున్నాడట. మరి మహేష్ ఏది ఫైనల్ చేస్తాడో చూడాలి. ఇక మహేష్ సరసన ఇప్పటివరకు ఏ హీరోయిన్ అనేది ఫైనల్ చేయలేదు సుకుమార్. ప్రస్తుతం అదే పనిలో ఉన్నట్టు సమాచారం. సుకుమార్ పై రంగస్థలం ఎఫెక్ట్ పడనుంది. పైగా ఎక్సపెక్టేషన్స్ కూడా ఎక్కువ అయిపోయాయి. మరి మహేష్ సినిమాతో సక్సెస్ అందుకుంటాడా లేదో చూడాలి.

Tags:    

Similar News