బన్నీకి భయపడుతున్న సుక్కు

రంగస్థలం కి ముందు సుకుమార్ చాలా కొత్తగా డిఫరెంట్ గా సినిమాలు తీసేవాడు. డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో తికమక పెడుతూ సినిమాలు చేసేవాడు. కానీ రంగస్థలం [more]

Update: 2019-09-08 08:00 GMT

రంగస్థలం కి ముందు సుకుమార్ చాలా కొత్తగా డిఫరెంట్ గా సినిమాలు తీసేవాడు. డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో తికమక పెడుతూ సినిమాలు చేసేవాడు. కానీ రంగస్థలం సినిమా స్ట్రెయిట్ నరేషన్ తో కూడుకుంది కాబట్టి ఈసినిమా తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సుక్కు కెరీర్ లోనే కాదు రామ్ చరణ్ కెరీర్ లో కూడా ఈమూవీ బిగ్గెస్ట్ హిట్.

మహేష్ తో తీద్దామనుకున్నా….

ఈమూవీ అంతటి హిట్ అవ్వడంతో సుక్కు నెక్స్ట్ సినిమా పై చాలా అంచనాలు పెట్టుకున్నారు. మహేష్ తో స్మగ్లర్ బ్యాక్ డ్రాప్ తో సుక్కు సినిమా చేద్దాం అనుకున్నాడు కానీ అది వర్క్ అవుట్ అవ్వలేదు. అందుకే వీరి కాంబినేషన్ లో సినిమా క్యాన్సల్ అయిందని ఇన్ సైడ్ టాక్. రంగస్థలం తో వచ్చిన ఇమేజ్ కాస్తా మళ్ళీ అక్కడ డౌన్ అవుతుందో అని ఆచి తూచి అడుగులేస్తున్నాడు సుక్కు.

అక్టోబరులోనే….

ఈ క్రమంలోనే సుక్కు బన్నీ తో స్మగ్లర్ బ్యాక్ డ్రాప్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. బన్నీ కి కథ నచ్చడంతో సుక్కు కథను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే సుక్కు మూడు వర్షన్స్ రాసుకున్నాడు. ఇప్పుడు లేటెస్ట్ గా నాలుగో వర్షన్ రాసుకుంటున్నాడు. అక్టోబర్ లో ఈమూవీ ని లాంచ్ చేయాలనీ చూస్తున్నారు. ఈలోగా సుక్కు నాలుగో వర్షన్ కంప్లీట్ చేస్తాడో చేయడా అన్నది చూడాలి. మరి ఇంత గ్యాప్ తీసుకున్న సుక్కు బన్నీ మూవీతో మళ్లీ హిట్ అందుకోవాలని ఆశిద్దాం.

Tags:    

Similar News