మహేష్ సినిమాకు ఇంకా స్టోరీ రెడీ అవ్వలేదా?

Update: 2018-10-28 05:38 GMT

చరణ్ తో నాన్ 'బాహుబలి' ఇండస్ట్రీ హిట్ కొట్టిన సుకుమార్ ప్రస్తుతం మహేష్ తో నెక్స్ట్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈసినిమాపై అంచనాలు బాగా ఉన్నాయి. గతంలో వీరి కాంబినేషన్ '1 నెన్నొక్కడినే' సినిమా వచ్చి డిజాస్టర్ గా నిలిచినా సంగతి తెలిసిందే. ఈసారి అటువంటి సినిమా తీయనని..స్ట్రెయిట్ నెరేషన్ తో మహేష్ ని పెట్టి సినిమా తీస్తానని సుకుమార్ చాలా సందర్భాల్లో అన్నాడు. అందుకే ఈసినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

మహర్షి షూటింగ్ లో.....

మహేష్ ప్రస్తుతం 'మహర్షి' సినిమాలో షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈసినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈసినిమా కంప్లీట్ అయినా వెంటనే సుకుమార్ తో మహేష్ సినిమా చేయనున్నాడు. కానీ ఆశర్యం ఏంటంటే సుకుమార్ ఇప్పుడు దాకా మహేష్ కు మూడు లైన్లు వినిపిస్తే మహేష్ దేనికీ కన్విన్స్ కాలేదట. దాంతో మహేష్ 26 వ సినిమా సుకుమార్ తోనే ఉంటుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటివరకు సుకుమార్ కు బలంగా నిలిచిన అతని టీమ్ లోని ముగ్గురు రైటర్లు దర్శకులుగా మారి సొంత ప్రాజెక్ట్స్ దక్కించుకోవడంతో వాళ్ళ అండ సుక్కుకు లేకుండా పోయింది.

నిజాం పాలన నాటి....

సుకుమార్ నిజాం పాలన నాటి రజాకార్ల బ్యాక్ డ్రాప్ లో ఓ లైన్ వినిపిస్తే పీరియాడిక్ కథలతో రిస్క్ వద్దని క్యాన్సిల్ చేసాడట. ఆల్రెడీ మహేష్ సుకుమార్ కు ఫిబ్రవరి కళ్ల స్క్రిప్ట్ మొత్తం రెడీగా ఉండేలా ప్లాన్ చేయమని సుక్కుకు ముందే చెప్పాడట. అది కూడా కథ నచ్చితేనే అనే కండీషన్ మీద. మరి సుకుమార్ ఏం చేస్తాడో చూడాలి. అసలు ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుందా? అని కామెంట్స్ చేస్తున్నారు మహేష్ ఫ్యాన్స్.

Similar News