మహేష్ ను కలిసిన సుకుమార్…ఏం జరిగింది..?

సూపర్ స్టార్ మహేష్ బాబు – సుకుమార్ మధ్య విభేదాలు వచ్చాయని అందరికీ తెలిసిందే. మహేష్ తో సినిమా చేయాల్సిన సుకుమార్ సడన్ గా అల్లు అర్జున్ [more]

Update: 2019-03-14 09:00 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు – సుకుమార్ మధ్య విభేదాలు వచ్చాయని అందరికీ తెలిసిందే. మహేష్ తో సినిమా చేయాల్సిన సుకుమార్ సడన్ గా అల్లు అర్జున్ తో సినిమా అనౌన్స్ చేయడంతో మహేష్ హర్ట్ అయ్యి సినిమా క్యాన్సిల్ చేసాడు. అయితే ఈ విషయంపై సుకుమార్ మహర్షి సెట్స్ కి వెళ్లి తన వర్షన్ చెప్పుకున్నాడట. తనను సంప్రదించకుండా అల్లు అర్జున్ తో సినిమా అనౌన్స్ చేయడం తప్పేనని, అది రియలైజ్ అయ్యానని, మహేష్‌ని చిన్నబుచ్చడానికి చేయలేదని సుకుమార్‌ చెప్పాడట. ఇద్దరిమధ్య వచ్చిన ఈ గొడవ పెద్దది కాకూడదని మహేష్ ని సుకుమార్ కలిశాడట.

మీడియా వైఖరిపై ఫీల్ అవుతున్న సుకుమార్

మీడియాలో సుకుమార్ పైనే వార్తలు రావడం సుక్కుకి నచ్చలేదట. అసలు తప్పంతా తనదేనని… సుకుమార్ మహేష్ ని మళ్లీ తనకి అవకాశమివ్వాలని బతిమాలుకున్నాడని, మహేష్‌ ఆలోచిద్దామని చెప్పాడని మీడియాలో రకరకాలుగా మీడియాలో వార్తలు రావడంతో సుక్కు ఫీల్ అయ్యాడట. ఎంతసేపూ హీరో పాయింట్ అఫ్ వ్యూ లోనే ఆలోచిస్తున్నారని.. కనీసం స్టార్ దర్శకుడు అనే మర్యాద కూడా ఇవ్వట్లేదని ఫీల్ అయ్యాడట.

Tags:    

Similar News