బన్నీతో పని లేదంటున్న సుక్కు

సుకుమార్ రంగస్థలం సినిమా కి వచ్చిన ఫిలిం ఫేర్ అవార్డ్స్ తో ఫుల్ ఖుషీగా ఉన్నాడు. నెంబర్ అఫ్ కేటగిరీస్ లో రంగస్థలం ఫిలింఫేర్ అవార్డ్స్ ని [more]

Update: 2019-12-25 04:48 GMT

సుకుమార్ రంగస్థలం సినిమా కి వచ్చిన ఫిలిం ఫేర్ అవార్డ్స్ తో ఫుల్ ఖుషీగా ఉన్నాడు. నెంబర్ అఫ్ కేటగిరీస్ లో రంగస్థలం ఫిలింఫేర్ అవార్డ్స్ ని ఎగరేసుకుపోయింది. ఇక సుకుమార్ రంగస్థలం తర్వాత అల్లు అర్జున్ తో సినిమా మొదలుపెట్టాడు. రంగస్థలం వచ్చిన ఏడాదిన్నర గ్యాప్ తో అల్లు అర్జున్ సినిమా తో సెట్స్ మీదకెళ్ళాడు సుకుమార్ . ఎర్రచందనం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ మధ్యనే పూజ కార్యక్రాలతో మొదలయ్యింది. అయితే అల్లు అర్జున్ అల వైకుంఠపురములో షూటింగ్ తో బిజీగా ఉండడంతో సుకుమార్… అల్లు అర్జున్ అవసరం లేని కొన్ని సీన్స్ ని చిత్రీకరణ చేస్తున్నాడు. ఇప్పటికే లొకేషన్స్ ని ఫైనల్ చేసుకున్న సుకుమార్… అల్లు అర్జున్ లేకుండా కొంతమేర షూటింగ్ చేసేసాడు.

కేరళలో షూటింగ్….

కేర‌ళ‌లోని ద‌ట్టమైన అడ‌వుల మ‌ధ్య… ఓ జ‌ల‌పాతం నేప‌థ్యంలో ఒక చక్కటి సీన్ ని సుకుమార్ చిత్రీకరించాడట. ఆ సినిమా షాట్ సూపర్ గా వచ్చిందని, బన్నీ లేకుండా తీసిన ఆ సన్నివేశంలో.. బ‌న్నీ పై బ్లూ మ్యాట్‌లో షాట్ తీసి, దాన్ని సీజీ స‌హాయంతో క‌వ‌ర్ చేస్తారని తెలుస్తుంది. అయితే ఈ సన్నివేశంతోనే అల్లు అర్జున్ ఇంట్రెడెక్షన్ సీన్ ఉండబోతుందని, పీట‌ర్ హెయిన్స్ ఈ స‌న్నివేశానికి యాక్ష‌న్ కొరియోగ్రఫీ అందించినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ జలపాతం సీన్ సినిమా హైలెట్స్ లో ఒకటిగా ఉండబోతుందని, ఇక బన్నీ వచ్చే లోపు సుకుమార్, బన్నీ తో అవసరం లేని షూటింగ్ సీన్స్ కంప్లీట్ చేస్తాడని అంటున్నారు.

Tags:    

Similar News