బన్నీ కూడా హ్యాండ్ ఇచ్చేలా ఉన్నాడే..!

నిన్నగాక మొన్న క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కి మహేష్ బాబు హ్యాండ్ ఇచ్చాడు. ఆరునెలల పాటు మహేష్ కథ మీద కూర్చుంటే.. మహేష్ కి సుకుమార్ కథ [more]

Update: 2019-04-08 06:09 GMT

నిన్నగాక మొన్న క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కి మహేష్ బాబు హ్యాండ్ ఇచ్చాడు. ఆరునెలల పాటు మహేష్ కథ మీద కూర్చుంటే.. మహేష్ కి సుకుమార్ కథ మీద నమ్మకం లేక సినిమా క్యాన్సిల్ చేసాడు. అయితే మహేష్ తో సుకుమార్ ఎర్రచందనం బ్యాగ్డ్రాప్ ఉన్న కథతోనే సినిమా చెయ్యాలనుకున్నాడు. కానీ మహేష్ కాదనడంతో ఆ కథని అల్లు అర్జున్ కి వినిపించడం… బన్నీ సుకుమార్ కి కనెక్ట్ అవడంతో బన్నీ, సుకుమార్ సినిమా అధికారికంగా అనౌన్స్ చేసాడు. త్రివిక్రమ్ సినిమా పూర్తి కాగానే సుకుమార్ తో అల్లు అర్జున్ సినిమా చేస్తాడని అన్నారు.

హాలీవుడ్ సినిమా పోలికలు ఉండటంతో

తాజాగా బన్నీకి సుకుమార్ చెప్పిన కథ మీద డౌట్స్ మొదలయ్యాయట. ఎందుకంటే బన్నీ సన్నిహితుడొకడు సుకుమార్ చెప్పిన కథలాంటి హాలీవుడ్ సినిమా డీవీడీ ఒకటి బన్నీ చేతికిచ్చి చూడమనగా.. సుకుమార్ చెప్పిన కథకి ఆ హాలీవుడ్ సినిమాకి పోలికలున్నాయట. దీంతో బన్నీకి సుకుమార్ మీద డౌట్ మొదలవడం ఒక ఎత్తు అయితే దిల్ రాజు వేణు శ్రీరామ్ తో అల్లు అర్జున్ ని డైరెక్ట్ చేయించాలని చూడడం మరొక కారణంతో సుకుమార్ ని అల్లు అర్జున్ పిలిచి ఈ కథ వద్దు మరో మంచి కథ తయారు చెయ్యండి… కంగారేం లేదని చెప్పడంతో వీరి సినిమాపై అనుమానాలు వస్తున్నాయి.

Tags:    

Similar News