సుజిత్ ని తక్కువ అంచనా వేశారుగా..!

Update: 2018-10-25 06:59 GMT

ప్రభాస్ పుట్టిన రోజునాడు ప్రభాస్ ఫాన్స్ కి ఇచ్చిన ట్రీట్ అలాంటి ఇలాంటిది కాదు. ప్రభాస్.. సుజిత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ లో నటిస్తున్న భారీ చిత్రమైన సాహో చిత్రానికి సంబంధించిన షేడ్స్ ఆఫ్ సాహో ప్రభాస్ ఫాన్స్ ని మాత్రమే కాదు.. సగటు ప్రేక్షకుడిని ఉర్రుతలూగించింది. బాహుబలి తర్వాత ప్రభాస్ సాహో సినిమాలో స్టైలిష్ లుక్ లో ఇరగదీసాడు. అయితే బాహుబలి లాంటి భారీ ప్రాజెక్ట్ తర్వాత ప్రభాస్ కేవలం చిన్న దర్శకుడైన సుజిత్ ని పెద్ద ప్రాజెక్ట్ చెయ్యడానికి తీసుకోవడంపైనా అందరిలో పలు అనుమానాలు నెలకొన్నాయి. అసలు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని సుజిత్ ఎలా హ్యాండిల్ చేస్తాడు..? ఒకేసారి నేషనల్ వైడ్ గా సినిమాని ఎలా తెరకెక్కించగలడా..? అంటూ పలు రకాల అనుమానాలు సినిమారంగ నిపుణులు, క్రిటిక్స్, సినీ పెద్దలు కూడా వచ్చాయ.

అనుమానాలన్నీ పటాపంచలు...

కానీ షేడ్స్ ఆఫ్ సాహో చూసాక.. దర్శహకుడు సుజిత్ ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. అసలేమీ తెలియని సుజిత్ ఇలా ప్రభాస్ ని ఆకట్టుకునేలా చూపించి అన్ని భాషల వారిలో సాహో చిత్రంతో భారీ అంచనాలు పెంచేలా చేసాడు. సాహో యాక్షన్ ఎపిసోడ్ చూసాక సుజిత్ పనితనం మీదున్న అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. ప్రభాస్ కోసం ఐదేళ్లుగా వెయిట్ చేసిన సుజిత్ ఇప్పుడు ప్రభాస్ కి న్యాయం చేసాడనిపిస్తుంది. నేషనల్ వైడ్ గా పేరు తెచ్చుకున్న ప్రభాస్ క్రేజ్ ని ఇసుమంతైనా తగ్గకుండా చూపించగలిగాడు. హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించిన ఆ యాక్షన్ ఎపిసోడ్ లో గ్రాఫిక్స్, విజువల్స్ అన్ని చూసిన ప్రేక్షకుడు ఇది కేవలం బాలీవుడ్ కి, హాలీవుడ్ కి మాత్రమే సరిపోయే మూవీగా కొనియాడడం ఖాయం అంటున్నారు. మరి యాక్షన్ ఎపిసోడ్ హాలీవుడ్ స్టెంట్ మాస్టర్స్ పక్కన ఉన్నపుడు జరిగినా అది సుజిత్ ఆధ్వర్యంలో తెరకెక్కినవే. బాహుబలితో ప్రపంచాన్ని చుట్టేసిన ప్రభాస్ సాహూతో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.

Similar News