లూసిఫెర్ రీమేక్: మంజు వారియర్ పాత్రలో ఆమె?

మలయాళంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన పొలిటికల్ బ్యాగ్రౌండ్ మూవీ లూసిఫెర్ ని చిరంజీవి సుజిత్ దర్శకత్వంలో రీమేక్ చెయ్యబోతున్నారు. మోహన్ లాల్ పాత్రలో చిరు నటిస్తున్నఈ [more]

Update: 2020-06-23 04:36 GMT

మలయాళంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన పొలిటికల్ బ్యాగ్రౌండ్ మూవీ లూసిఫెర్ ని చిరంజీవి సుజిత్ దర్శకత్వంలో రీమేక్ చెయ్యబోతున్నారు. మోహన్ లాల్ పాత్రలో చిరు నటిస్తున్నఈ రీమేక్ ఇక్కడ తెలుగులో డబ్ అవకుండా ఉంటే బావుండేది. మోహన్ లాల్ మీద ఉన్న ఆసక్తి, కరోనా లాక్ డౌన్ తో లూసిఫెర్ తెలుగు దబెడ్ మూవీని తెలుగు ప్రేక్షకులు చాలామంది అమెజాన్ ప్రైమ్ లో వీక్షించేసారు. ఇలాంటి టైములో ఈ సినిమాని యాజిటీజ్ గా రీమేక్ చెయ్యడం అంటే కాస్త ఆలోచించాల్సిందే. రీమేక్ లో భారీగా మార్పులు చేర్పులు చేసి.. తెలుగు నేటివిటీకి దగ్గరగా… తెలుగు ఆడియన్స్ కోరుకునే ఎమోషన్స్ కి తగ్గట్టుగా లూసిఫెర్ స్క్రిప్ట్ రాసుకుంటే ఓకె కానీ.. ఇలా చేయడం వలన ఒక్కోసారి మాతృక మీదున్న ఇంప్రెషన్ పోతుంది. మరి సుజిత్ ఇప్పటికే చిరు సలహాలతో తెలుగు స్క్రిప్ట్ ని సిద్ధం చేసాడనే టాక్ ఉంది.

అయితే ఈ సినిమాలో మెహన్ లాల్  మెయిన్ లీడ్ కాగా.. ఆయనకు చెల్లెలి పాత్రలో మలయాళంలో మోహన్ లాల్ పాత్రని అస్సహించుకునే పాత్రలో మంజు వారియర్ నటించింది. తెలుగులో ఆ పాత్ర చెయ్యడానికి ముందుగా విజయ్ శాంతి పేరు తెర మీదకి రాగా.. విజయ్ శాంతి ఆ పాత్ర చెయ్యడం లేదని క్లారిటీ వచ్చింది. తాజాగా ఆ పాత్ర చిరుతో హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న సుహాసిని చేయబోతుంది అనే టాక్ వినబడుతుంది. అయితే అది నిజామా… రూమరా…ఆనేది తెలియాల్సి ఉండగా… మలయాళ లూసిఫెర్ లో మోహన్ లాల్ తర్వాత అతని అనుచరుడి పాత్రలో పృద్వి రాజ్ చేసాడు. ఆ పాత్రని తెలుగులో రానా చెయ్యబోతున్నట్టుగా టాక్ ఉంది. మరి ఆ చెల్లి, అనుచరుడి పాత్రలు ఎవరు చేస్తారో అనేది ఫైనల్ గా తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News