ఇప్పటికైనా క్లారిటీ వచ్చిందా?

హాట్ యాంకర్ రష్మీ దేశాయ్ కమెడియన్ కం హీరో సుధీర్ ల మధ్యన ఏదో ఉండనే న్యూస్ సోషల్ మీడియాలో రప్పటికప్పుడు హైలెట్ అవుతూనే ఉంటుంది. మరి [more]

Update: 2020-10-19 11:30 GMT

హాట్ యాంకర్ రష్మీ దేశాయ్ కమెడియన్ కం హీరో సుధీర్ ల మధ్యన ఏదో ఉండనే న్యూస్ సోషల్ మీడియాలో రప్పటికప్పుడు హైలెట్ అవుతూనే ఉంటుంది. మరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ వారి ఇద్దరి మధ్యన అలా అనుకునేలా పాపుల్లర్ అయ్యింది. రష్మీ తో సుధీర్ పేరు ముడిపెట్టి ఒక్క జబర్దస్త్ లోనే కాదు…. ఢీ డాన్స్ షో లోను కామెడీ నడిపించేస్తున్నారు. కానీ మా మధ్యన ఏం లేదు.. మేమిద్దరం కేవలం ఫ్రెండ్స్ అని చెప్పినా ఎవరు వినరు. ఎప్పటికప్పుడు తమ మీద వస్తున్న రూమర్స్ కి రష్మీ చెక్ పెడుతూనే ఉంటుంది. కానీ గాసిప్స్ కి మాత్రం అంతూ పొంతూ లేకుండా పోతుంది. తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ ౩౦౦ వ ఎపిసోడ్ లో రష్మీ – సుధీర్ ల ప్రేమ విషయం మళ్ళి మొదటికి వచ్చింది. జబర్దస్త్ నటులు, అభిమానుల తరుపున జేడ్జ్ రోజా రష్మీ – సుధీర్ ల మధ్యన ఏం జరుగుతుందో చెప్పమని అడిగేసింది.

దానితో సుధీర్ రష్మీ పేరు తనతో లింక్ పెట్టి ప్రచారం చేసినప్పటినుండి అంటే ఏడేళ్ల నుండి మా జంట ఆన్ స్క్రీన్ లో తెగ పాపులర్ అయ్యింది. కానీ రష్మీ పేరు లేకపోతె నేను ఒట్టి సుధీర్ నే.. రష్మీ పేరు ఉండడం వలెనే తాను పాపులర్ అయ్యానని మొహమాటం లేకుండా చెప్పడమే కాదు…. ప్రతి విజయం వెనుక ఓ ఆడది ఉంటుంది అంటారు.. కానీ నా విజయం నా పక్కనే ఉంది అంటూ రష్మీ ని ఆకాశానికెత్తేసాడు సుధీర్. దానితో రష్మీ హ్యాపీ గా సుధీర్ తాను మంచి ఫ్రెండ్స్ అని, జబర్దస్త్ లో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ.. తమ జంట మాత్రం బాగా పాపులర్ అయ్యింది అని… ప్రతి రిలేషన్ కి పేరు పెట్టాల్సిన అవసరం లేదని.. కొన్ని రిలేషన్ షిప్స్ అంతే.. మేము ఒకరినొకరం అర్ధం చెసుకున్నామంటూ స్మూత్ గా చెప్పేసింది. మరి ఇప్పటికైనా ప్రేక్షకులకు క్లారిటీ వస్తే ఓకె.. లేదంటే లేదు. అయినా ప్రేక్షకులకు క్లారిటీ వచ్చేలోపు మళ్ళి ఈ టీవీ ఏదో ప్రోగ్రాం ప్లాన్ చెయ్యడం రష్మీ – సుధీర్ మీద ఓ ట్రాక్ సెట్ చెయ్యడం.. మళ్ళి ప్రేక్షకులు అయోమయంలో పడడం మాములే.

Tags:    

Similar News