మహేష్ సినిమాలో కనిపించాలనే కోరిక ఉంది!!

మహేష్ సినిమా లో అవకాశం వస్తే ఎవ్వరూ వదులుకోరు. అందులో హీరోయిన్స్ అయితే అస్సలు వదలరు. మరి ఆయన బావ సుధీర్ బాబు మాత్రం ఎందుకు వదులుతాడు. [more]

Update: 2020-09-01 05:14 GMT

మహేష్ సినిమా లో అవకాశం వస్తే ఎవ్వరూ వదులుకోరు. అందులో హీరోయిన్స్ అయితే అస్సలు వదలరు. మరి ఆయన బావ సుధీర్ బాబు మాత్రం ఎందుకు వదులుతాడు. ప్రస్తుతం సుధీర్ బాబు నటించిన వి సినిమా అమెజాన్ ప్రైమ్ లో వచ్చే శనివారం విడుదలకబోతుంది. ఆ సందర్భంగా వి సినిమాని ప్రమోట్ చేస్తున్న సుధీర్ బాబుకి మహేష్ సినిమాలో అవకాశం వస్తేనటిస్తారా అనే ప్రశ్న ఎదురైంది. దానికి సుధీర్ బాబు మహేష్ సినిమాలో అవకాశం రావాలె కానీ.. ఎందుకు వదులుకుంటాను. ఆయనా తో రెండు మూడు సినిమాల్లో నటించాలనే కోరిక నాకు ఉంది. మరి ప్రస్తుతం హీరోగా ఉన్న మీరు మహెష్ కి విలన్ గా నటించాలంటే ఏం చేస్తారు అని అడగగా..

మహేష్ బాబు సినిమాలో విలన్ పాత్ర వస్తే నటించడానికి ఎలాంటి ప్రాబ్లెమ్ లేదు. పాత్ర బావుంటే ఖచ్చితంగా విలన్ గా నటిస్తాను. విలన్ పాత్ర కాకపోయినా.. ఏదో ఒక కేరెక్టర్ లో మహేష్ బాబు సినిమాల్లో నటిస్తే బావుంటుంది. నాకు మహేష్ సినిమాల్లో కనిపించాలని ఉంటుంది. నేను వెళ్లి మీ సినిమాలో నాకో పాత్ర ఇవ్వమంటే మహేష్ కాదనరు. కానీ ఏదో ఒక పాత్ర చేసే కన్నా.. మహేష్ సినిమాలో మంచి ఉద్దేశ్యంతో ఉన్న పాత్ర ఏదైనా చేస్తే బావుంటుంది.. అదే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. ఏదో చిన్న చితక పాత్రలలో కనిపించాలనుకుంటే ఈపాటికే మహేష్ సినిమాలో నేను ఎక్కడో అక్కడ కనిపించేవాడిని అంటూ చెప్పుకొచ్చాడు సుధీర్ బాబు

Tags:    

Similar News