మ‌న‌స్సు దోచుకొవ‌టానికి వ‌స్తున్న సుధీర్ బాబు

Update: 2018-07-16 11:54 GMT

సమ్మోహనం తో తెలుగు ప్రేక్ష‌కుల్ని స‌మ్మోహ‌నం చేసుకున్న సుధీర్ బాబు హీరోగా, సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యాన‌ర్ లో ఆర్‌.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం నన్ను దోచుకుందువటే. ఈ చిత్రం మెద‌టి లుక్ టీజ‌ర్ ని 14న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చారు. ఈ టీజ‌ర్ లోనే దాదాపుగా సినిమా కాన్సెప్ట్ ని చెప్పారు. ఆఫీస్ మెత్తం బ‌య‌ప‌డే సాఫ్ట్ వేర్ కంపెని మేనేజ‌ర్ గా సుధీర్‌ బాబు న‌టించ‌గా.. బాగా అల్ల‌రి చేసే గ‌డుస‌మ్మాయి సిరి పాత్ర‌లో హీరోయిన్ న‌భా న‌టేశ్ క‌నిపించింది. రొమాంటిక్ కామెడి చిత్రంగా రెడి అవుతున్న ఈ చిత్రాన్ని అన్నికార్య‌క్ర‌మాలు పూర్తిచేసి వినాయ‌క చ‌వితి ప‌ర్వ‌దినాన సెప్టెంబ‌ర్ 13న విడుద‌ల చేయాటానికి స‌న్నాహ‌లు చేస్తున్నారు. సెప్టెంబర్ 12న ప్రీమియర్ షోస్ ప్లాన్ చేస్తున్నారు. టైటిల్ ఎనౌన్స్‌ మెంట్ నుండి ప్రేక్ష‌కుల్లో ఈ చిత్రం పై అంచ‌నాలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్య‌క్ర‌మాలు శరవేగంగా జరుగుతున్నాయి.

Similar News