ఆ డైరెక్టర్ కోసం పాకులాడుతున్న స్టార్ హీరోలు!!

బెల్లం చుట్టూ ఈగలు వాలడం ఎంత సహజమో.. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ చుట్టూ స్టార్ హీరోలు చేరడం అంతే సహజం. మరి ఒక తెలుగమ్మాయి తమిళంలో హవా [more]

Update: 2020-11-18 05:57 GMT

బెల్లం చుట్టూ ఈగలు వాలడం ఎంత సహజమో.. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ చుట్టూ స్టార్ హీరోలు చేరడం అంతే సహజం. మరి ఒక తెలుగమ్మాయి తమిళంలో హవా చూపిస్తుంటే హీరోలు ఎందుకూరుకుంటారు. తెలుగమ్మాయిగా పుట్టి చెన్నై లో సెటిల్ అయ్యి అక్కడి హీరోలతో సినిమా చేస్తూ హిట్స్ కొడుతున్న సుధా కొంగర ఆకాశం నీ హద్దురా కన్నా (సూరరై పొట్రూ తమిళ) ముందే సాలా ఖాదూస్ సినిమాతో అందరిని ఆకర్షించింది. అదే సినిమాని తెలుగులో గురు పేరుతొ రీమేక్ చేసి హిట్ కొట్టిన సుధా కొంగర ఆరేళ్ళ గ్యాప్ తర్వాత సూర్య తో ఆకాశం నీ హద్దురా సినిమా డైరెక్ట్ చేసి అదరహో అనిపించింది. హీరోగా సూర్యకి మంచి పేరు తెచ్చిపెట్టిన ఆకాశం నీ హద్దురా సినిమాకి సుధా కొంగర మేకింగ్ మెయిన్ ఎస్సెట్.

ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఇప్పుడు తమిళ స్టార్ హీరోల చూపు సుధా కొంగరపై పడింది. ఇప్పటికే సుధా కొంగర తన తదుపరి చిత్రం అజిత్ తో చెయ్యబోతుంది అనే టాక్ వినిపిస్తుండగా.. ఇప్పుడు స్టార్ హీరో విజయ్ తో పాటుగా, విజయ్ సేతుపతి కూడా సుధా కొంగరతో సినిమా చేసే విషయంలో తొందరపడుతున్నట్టుగా కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. సుధా కొంగర తో సినిమా కోసం ఇప్పటికే విజయ్, విజయ్ సేతుపతి చర్చలు జరుపుతున్నట్టుగా కుడా కోలీవుడ్ మీడియా కథనం. మరి ఒక్క సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఆ దర్శకుడి రేంజ్ ఒక్కసారిగా మరిపోతుంది అనడానికి సుధా కొంగారనే కాదు.. చాలామంది దర్శకులు సాక్ష్యంగా కనిపిస్తున్నారు. 

Tags:    

Similar News