హాట్ టాపిక్ గా మారిన చిరుపై సుదీప్ ట్వీట్

Update: 2018-07-10 07:45 GMT

మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించాలని చాలా మంది స్టార్స్ కలలు కంటారు. కెరీర్ లో ఒక్కసారైనా నటించాలని భావిస్తుంటారు. అయితే అటువంటి అవకాశమే కన్నడ సూపర్ స్టార్ కిచ్చ సుదీప్ కి ఛాన్స్ వచ్చింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సైరా' చిత్రంలో సుదీప్ ఒక కీలక పాత్ర చేస్తున్నాడు.

చర్చనీయాంశమైన ట్వీట్...

అయితే సుదీప్ మాత్రం చిరుతో నటిస్తున్నందుకు ఆందోళన పడుతున్నాడట. ఈ విషయంలో వివరణ ఇవ్వలేదు కానీ.. తాను ఆందోళనలో ఉన్న మాట మాత్రం వాస్తవం అన్నాడు. గత ఏడాది స్టార్ట్ అయిన ఈ సినిమా షూటింగ్ లో లేటెస్ట్ గా సుదీప్ టీంతో కలిశాడు. అతడిపై కొన్ని సన్నివేశాలు ప్రస్తుతం షూట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా అయన ఇలా ట్వీట్ చేయడం చేర్చనీయాంశమైంది.

ఎగ్జైటింగ్ తో పాటు ఆందోళన...

"తనకు సినిమా అన్నది ఎప్పటికప్పుడు సర్ ప్రైజ్‌లు ఇస్తూనే ఉందని... అందులో భాగంగానే నేను మెగా స్టార్ చిరంజీవితో తొలిసారి నటించబోతున్నాని... సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో నటిస్తున్నాని..నా కెరీర్ లోనే తొలిసారిగా నేను చారిత్రక సినిమాలో నటిస్తున్నాని ట్వీట్ చేసాడు. దాని కింద.. నాకు చాలా ఎగ్జైటింగ్ గా ఉందని చెబుతూ.. అలాగే ఆందోళనగా కూడా ఉందని అన్నాడు సుదీప్. అయితే ఆ ఆందోళనకు కారణమేంటో చెప్పలేదు సుదీప్.

Similar News