స్టార్ మా జోరు మామూలుగా లేదే..!

Update: 2018-10-16 06:42 GMT

ఈ మధ్యన ఈటివి, జీ తెలుగు సీరియల్స్ కి పోటీగా స్టార్ మా సీరియల్స్ తో గట్టి పోటీ ఇస్తుంది. సీరియల్స్ విషయంలో టీఆర్పీ రేటింగ్స్ లో ఈటివి స్టార్ మా పోటాపోటీగా నిలుస్తున్నాయి. అయితే ఈటీవీ లో గురు, శుక్రవారాల్లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ ని కొట్టే ప్రోగ్రాం మాత్రం ఇప్పటివరకు టీవీ ఛానల్స్ లో ఎక్కడా కనబడడం లేదు. అయితే స్టార్ మాలో బిగ్ బాస్ అంటూ గత ఏడాది మొదలైన బిగ్ బాస్ షో తో స్టార్ మా టీఆర్పీ రేటింగ్స్ ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.

బిగ్ బాస్ తో భారీ టీఆర్పీ

గత ఏడాది స్టార్ హీరో ఎన్టీఆర్ హోస్టింగ్ లో వచ్చిన బిగ్ బాస్ సీజన్ 1 ఓపెనింగ్ ఎపిసోడ్ కి, గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి స్టార్ మా అధిక టీఆర్పీ తెచ్చుకుని అందరిలో పై చెయ్యి సాధించింది. ఇక ఈ ఏడాది బిగ్ బాస్ సీజన్ 2 నాని హోస్టింగ్ లో వచ్చిన షో కూడా బాగానే సక్సెస్ అయ్యింది. అందుకే స్టార్ మా గత పదేళ్లుగా ఏ ఛానల్ సాధించలేని రికార్డులు సాధించిందని అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే 1000 ప్లస్ జీఆర్పీ మార్కును తాము సాధించామని.... తాజాగా జరిగిన బిగ్ బాస్ సీజన్ 2 గ్రాండ్ ఫినాలే 14.7 టీఆర్పీని ను సాధించిందని స్టార్ మా తెలిపింది.

రంగస్థలం వంటి సినిమాలతో

ఆదివారం స్టార్ మా లో ప్రసారమయ్యే బ్లాక్ బస్టర్ సినిమాలు చాలామంది ప్రేక్షకులు అంటే దాదాపుగా 50 శాతం మంది వీక్షిస్తున్నారని... అలాగే స్టార్ మా సీరియల్స్ కి కూడా మంచి ఆదరణ ఉందని... బిగ్ బాస్ సీజన్ 2 ముగిసిన తర్వాత ఆ టైంకే మా టీవీలో ప్రసారం అవుతున్న ప్రదీప్ పెళ్లి చూపులుకి వస్తున్న ఫీడ్ బ్యాక్ బావుందని స్టార్ మా చెబుతుంది. మరి సీరియల్స్ విషయంలో, కామెడీ షోస్ విషయంలో ఈటీవీ తో ఎప్పుడూ స్టార్ మా గట్టి కాంపిటీషన్ ఎదుర్కొంటుంది అనేది మాత్రం వాస్తవం. కాకపోతే గత ఆదివారం సాయంత్రం ప్రసారమైన రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ స్టార్ మా లో ప్రసరమైతే స్టార్ మా టీఆర్పీలు ఆకాశాన్ని తాకడం మాత్రం ఖాయం.

Similar News