మణిరత్నం సినిమా నుంచి తప్పుకున్న స్టార్

హీరో వేషాలు.. లేదంటే స్పెషల్ క్యారెక్టర్స్ తో చెలరేగిపోతున్న తమిళ హీరో విజయ్ సేతుపతి ఇప్పుడు స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ [more]

Update: 2019-04-03 06:49 GMT

హీరో వేషాలు.. లేదంటే స్పెషల్ క్యారెక్టర్స్ తో చెలరేగిపోతున్న తమిళ హీరో విజయ్ సేతుపతి ఇప్పుడు స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విజయ్ సేతుపతి దూసుకుపోతున్నాడు. తాజాగా 96, సూపర్ డీలక్స్ తో విజయ్ సేతుపతి అదిరిపోయే బ్లాక్ బస్టర్ కొట్టాడు. సూపర్ డీలక్స్ లో ట్రాంస్జెండర్ గా విజయ్ సేతుపతి నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోపక్క సైరా నరసింహారెడ్డిలో ఓ కీ రోల్ లోనూ నటిస్తున్న విజయ్ ఇప్పుడొక క్రేజీ ఆఫర్ ని వదులుకున్నాడట. అది కూడా లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం ఆఫర్ ని విజయ్ సేతుపతి వదులుకున్నాడనే టాక్ వినబడుతుంది.

కాల్ షీట్స్ ఇవ్వలేక..!

మణిరత్నం నవాబ్ అనే మల్టీస్టారర్ తర్వాత మరో మల్టీస్టారర్ మూవీకి ప్లాన్ చేస్తున్నాడు. ఆ సినిమా కథను ఇప్పటికే సిద్ధం చేసాడని.. ఆ సినిమా రాజరాజ చోళుని చరిత్ర ఆధారంగా పొన్నియిన్ సెల్వం టైటిల్ తో తెరకెక్కించడానికి మణిరత్నం ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఆ సినిమాలో విజయ్ సేతుపతి ఒక కీలక పాత్రలో చేయబోతున్నాడనే న్యూస్ నడిచింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం…. విజయ్ సేతుపతి మణిరత్నం తో తాను ఆ సినిమాలో నటించలేనని చెప్పాడట. కారణం విజయ్ సేతుపతి మణిరత్నం సినిమాలో నటించడానికి చాలా కాల్షీట్స్ అవసరమవుతాయట. చారిత్రక నేపథ్యంతో కూడిన కథ కావడం వలన మణిరత్నం భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేసుకోవడంతో విజయ్ కాల్షీట్స్ అడ్జెస్ట్ చెయ్యలేక మణిరత్నం సినిమా నుండి డ్రాప్ అయినట్లుగా తెలుస్తుంది.

Tags:    

Similar News