#RRR టైటిల్ అది కాదా?

Update: 2018-11-19 02:40 GMT
Ram Charan Junior NTR Rajamouli #RRR

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న #RRR చిత్రం రీసెంట్ గా పూజా కార్యక్రమం జరుపుకుంది. ఈనెల 19 నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వకముందే ఈసినిమాపై రోజుకొక వార్త బయటికి వచ్చి హల్ చల్ చేస్తుంది. ఈసినిమా స్టోరీ ఏంటి..ఎటువంటి జోనర్..ఇందులో ఎవరుఎవరు ఉన్నారు..హీరోయిన్స్ ఎవరు అన్న విషయాల పై ప్రేక్షకులతో పాటు సినీ జనాల్లో కూడా క్యూరియాసిటీ ఎక్కువ అయింది.

అయితే కొన్ని రోజులు నుండి ఈసినిమా టైటిల్ పై చర్చ జరుగుతుంది. #RRR అంటే 'రామ రావణ రాజ్యం' అనే స్పెక్యులేషన్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే జక్కన్న అండ్ టీం మాత్రం ఇంకా టైటిల్ గురించి ఏమి అనుకోలేదట. టైటిల్ గురించి రాజమౌళి తన ఫ్యామిలీ మెంబర్స్ తో చర్చలు జరుపుతున్నారని టాక్. ఇది మల్టిలాంగ్వేజ్ సినిమా కాబట్టి అన్ని భాషలకు కలిపి ఒకే టైటిల్ ఉంటే బాగుంటుందని జక్కన్న ఆలోచనట.

'బాహుబలి' లాగా ప్యాన్ ఇండియా అప్పీల్ ఉంటూ అదే సమయంలో పవర్ఫుల్ గా కూడా ఉండాలి అని రాజమౌళి భావిస్తున్నాడట. ఈనెల 19 నుండి జరుగుతున్న షెడ్యూల్ దాదాపు 45 రోజులు పాటు జరగనుంది. ఈ షెడ్యూల్ తరువాత టైటిల్ ను ప్రకటించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. జక్కన్న తన సినిమాల టైటిల్ విషయంలో ఏది త్వరగా ఫైనల్ చేయడు. సో ఇది కూడా అంతే

Similar News