కొత్త అవతారంలో శ్రీరెడ్డి

Update: 2018-05-18 12:48 GMT

సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై పోరాడుతూ వార్తల్లోని వ్యక్తిగా మారిన శ్రీరెడ్డి కొత్త అవతారమెత్తింది. గత కొన్ని రోజులుగా సినీ పరిశ్రమలో మహిళా నటులపై వేదింపులు జరుగుతున్నాయని, వారందరికీ తాను అండగా ఉంటానని ఆమె ప్రకటించింది. తనను పలువురు సినీ ప్రముఖులు వేదించారని, వారి పేర్లు బయటపెట్టి సంచలనం సృష్టించారు. ఇండస్ట్రీలో మహిళా నటులకు అండగా పోరాడతానన్న ఆమె ఇవాళ కొత్త అవతారంలో కనిపించింది. తమకు పనులు కల్పించాలని రోడ్డెక్కిన ఉపాధి హామీ కూలీలకు మద్దతుగా ఆమె కూడా రోడ్డపై బైఠాయించారు. దైవదర్శనం కోసం ఆమె శ్రీశైలం వెళుతుండగా, మార్గమధ్యంలో ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గురిజేపల్లి వద్ద పనుల కోసం ఉపాధి హామీ కూలీలు రోడ్డుపై ధర్నా చేస్తున్నారు. దీంతో శ్రీరెడ్డి కూడా కారు దిగి తలకు పాగా కట్టి వారికి మద్దతుగా బైఠాయించారు. ఇన్ని రోజుల పాటు టీవీల్లో కనిపించిన శ్రీరెడ్డి కొత్త అవతారమెత్తడంతో స్థానికులు కొంత ఆశ్చర్యపోయారు.

Similar News