బిగ్ క్రేజ్ తో పిల్ల పిచ్చెక్కిస్తుందిగా

బిగ్ బాస్ లోకి అడుగు పెట్టకముందే యాంకర్ శ్రీముఖి బుల్లితెర మీద క్వీన్. జీ ఛానల్ లో, ఈటివి పటాస్ లో శ్రీముఖి మాములుగా యాంకరింగ్ చెయ్యదు. [more]

Update: 2020-01-31 08:43 GMT

బిగ్ బాస్ లోకి అడుగు పెట్టకముందే యాంకర్ శ్రీముఖి బుల్లితెర మీద క్వీన్. జీ ఛానల్ లో, ఈటివి పటాస్ లో శ్రీముఖి మాములుగా యాంకరింగ్ చెయ్యదు. పెద్ద గొంతెసుకుని… చిన్న రాములమ్మగా వీరంగం సృష్టిస్తూ అందరిని ఎంటర్టైన్ చేసేది. ఇక బిగ్ బాస్ సీజన్ త్రీ ద్వారా బుల్లితెర ప్రేక్షకులందరికీ దగ్గరైన శ్రీముఖి.. ఆ షో కి వెళ్లొచ్చాక గ్లామర్ షో కి తెర లేపింది. అందమైన డ్రెస్సులతో.. ఆకర్షణీయమైన షోస్ తో శ్రీముఖి క్రేజ్ మాములుగా లేదు.. ఇక ఆడియో వేడుకలు, ప్రీ రిలీజ్ వేడుకలు అంటూ.. శ్రీముఖి అవుట్ డోర్ లో జరిగే భారీ సినిమాల ఈవెంట్స్ లో హల్చల్ చేస్తుంది. బిగ్ బాస్ టైటిల్ కోసమే వెళ్లిన శ్రీముఖి రన్నరప్ గా నిలిచినప్పటికీ.. శ్రీముఖి కి బిగ్ బాస్ టైటిల్ కొట్టినంత క్రేజ్ వచ్చేసింది. దానితో ఎడా పెడా షోస్ చెయ్యడం, ఈవెంట్స్ కి యాంకరింగ్ చెయ్యడం అబ్బో ఒకటేమిటి పాప తెగ చెలరేగిపోతుంది.

తాజాగా టైమ్స్ అఫ్ ఇండియా లో మోస్ట్ డిజైరబుల్ విమెన్ ఆన్ టివి గా శ్రీముఖి టాప్ 1 లో నిలిచింది. ప్రతి ఏడాది టైమ్స్ అఫ్ ఇండియా మోస్ట్ డిజైరబుల్ విమెన్ లిస్ట్ లో నా పేరు ఉండడమే గొప్పగా ఫీల్ అయ్యేదానిని.. కానీ ఈరోజు ఆ లిస్ట్ లో నాపేరు మొదటి స్థానంలో ఉండడంతో.. నాకు చెప్పలేనంత సంతోషంగా ఉంది అంటూ తన హ్యాపీనెస్ ని అభిమానులల్తో పంచుకుంది. మరి హాట్ యాంకర్ అయినా అనసూయ కూడా శ్రీముఖి ముందు వెలవెల బోయింది. శ్రీముఖి టాప్ వన్ లో ఉంటే… విద్య టాప్ 2 లో జబర్దస్త్ హాట్ యాంకర్ రష్మీ టాప్ 5 లో ఉండగా… అనసూయ 14 స్థానంతో సరిపెట్టుకుంది

Tags:    

Similar News