రాహుల్ ని విన్నర్ గా ఇప్పటికి ఒప్పుకోవడం లేదు

బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్ కాకముందు సింగర్ రాహుల్ సిప్లిగంజ్, యాంకర్ శ్రీముఖి లుమంచి ఫ్రెండ్స్. కానీ హౌస్లోకి ఎంటర్ అయ్యాక ఇద్దరు బద్ద శత్రువులుగా [more]

Update: 2019-11-12 06:02 GMT

బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్ కాకముందు సింగర్ రాహుల్ సిప్లిగంజ్, యాంకర్ శ్రీముఖి లుమంచి ఫ్రెండ్స్. కానీ హౌస్లోకి ఎంటర్ అయ్యాక ఇద్దరు బద్ద శత్రువులుగా మారిపోయారు. రాహుల్ ని ప్రతి వీక్ టార్గెట్ చేస్తూ ఎలిమినేషన్ కి పంపిన శ్రీముఖి చివరిలో గేమ్ ప్లాన్ మార్చినా … రాహుల్ ఈజీగా బిగ్ బాస్ టైటిల్ ని ఎగరేసుకుపోయాడు. శ్రీముఖి రన్నరప్ గా నిలిచింది. తానే విన్నర్ అనుకున్న శ్రీముఖికి షాకిచ్చి విన్నర్ గా రాహుల్ ని ప్రకటించడం ఆమెకి షాకిచ్చింది. రాహుల్ విన్నర్ గా బయటికొచ్చి తెగ ఇంటర్వూస్ ఇస్తూ హైలెట్ అవుతున్నప్పటికీ శ్రీముఖి మాత్రం రాహుల్ ని అసలు విన్నర్ గా చూడడం లేదు.

ఆమె తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తనతో హౌసెమెట్స్ అందరూ బావుంటారని, రాహుల్ తో గొడవ బిగ్ బాస్ హౌస్ లోనే వదిలేసానని, ఎప్పటిలాగే తాము ఫ్రెండ్స్ అని చెప్పిన శ్రీముఖి.. తన దృష్టిలో అసలు సిసలైన బిగ్ బాస్ విన్నర్ బాబా భాస్కర్ అంటూ తన శిష్యుడిలా బిహేవ్ చేసిన డాన్స్ మాస్టర్ బాబా కి క్రెడిట్ అంతా ఇచ్చేసింది. మరి రాహుల్ తన దృష్టిలో విన్నర్ కాదని శ్రీముఖి ఫీలింగ్. రాహుల్ కన్నా బాబా భాస్కర్ బెటర్ అని ఆమె అంటుంది. ఇక బిగ్ బాస్ హౌస్ లో మానవ సంబంధాలు ఎలా ఉండాలో నేర్చుకున్నానని.. బిగ్ బాస్ హౌస్ లో రేషన్ ఉండదని చెబుతుంటారని, కానీ అది నిజం కాదని చెప్పిన శ్రీముఖి తమకు స్పెషల్ డిషెస్ ఉంటాయని చెప్పుకొచ్చింది.

Tags:    

Similar News