వాళ్ళకి శ్రీముఖి చెక్ పెట్టగలదా?

ఈటీవీలో గురు శుక్రవారాల్లో ప్రసారం అవుతున్న క్రేజీ కామెడీ షోస్ జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ లతో హాట్ యాంకర్స్ గా అనసూయ, రష్మీ గౌతమ్ లో ఓ [more]

Update: 2020-10-07 05:31 GMT

ఈటీవీలో గురు శుక్రవారాల్లో ప్రసారం అవుతున్న క్రేజీ కామెడీ షోస్ జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ లతో హాట్ యాంకర్స్ గా అనసూయ, రష్మీ గౌతమ్ లో ఓ రేంజ్ లో పాపులారిటీ సంపాదించారు. కామెడీతో జబర్దస్త్ స్కిట్స్ ఎలా పేలతాయో అంతే హాట్ గ్లామర్ తో అనసూయ, రష్మిలు అదరగొడతారు. అనసూయ వేసే డ్రెస్సులు, ఆమె స్టయిల్, అందానికి జబర్దస్త్ ప్రేక్షకులు ఫిదా అవుతుంటారు. ఇక రష్మీ కి తెలుగు మాట్లాడడం రాకపోయినా గ్లామర్ తోనే మ్యానేజ్ చేస్తుంది. అయితే జబర్దస్త్ తో బాగా పాపులర్ అయిన ఈ యాంకర్స్ కి సినిమా అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. ఏ యాంకర్స్ కి లేని డిమాండ్ ఈ హాట్ యాంకర్స్ కి ఉంది.

ఇక పటాస్ తోనూ, ఢీ జూనియర్స్ తో యాంకర్ గా కెరీర్ మొదలెట్టిన శ్రీముఖి గత ఏడాది బిగ్ బాస్ సీజన్ 3 లోను పాపులారిటీ సంపాదించింది. ఇక ఈ ఏడాది ఓహ్ ఉమానియా అనే షో తో యూట్యూబ్ ఛానల్ లో హడావిడి చేసిన శ్రీముఖి.. ఇప్పుడు జీ తెలుగులో ప్రసారం అవుతున్న అదిరింది 2 కామెడీ షోకి యాంకర్ గా మారింది. ఈ షోలో శ్రీముఖి హాట్ గా కన్నా మాటలతో నే ఎక్కుగా హడావిడి చేస్తుంది. అదిరింది 2 మరో లెవల్ కామెడీ అంటూ నాగబాబు, సుమ, జానీ మాస్టర్ లు గెస్ట్ లుగా శ్రీముఖి యాంకరింగ్ లో మొదలైన ఈ షో గత ఆదివారం పర్వాలేదనిపింది. అయితే శ్రీముఖి తన యాంకరింగ్ తో అనసూయ, రశ్మిలకి చెక్ పెట్టగలదా అనేది కాస్త డౌట్. ఎందుకంటే అనుసయా, రష్మీ పాపులారిటీ కొట్టేయాలంటే శ్రీముఖి ఇంకా కొత్తగా ఏదో ట్రై చెయ్యాలి అంటున్నారు.

Tags:    

Similar News