శ్రీకాంత్ విషయంలో నాని ధైర్యం చేస్తాడా..?

Update: 2018-10-11 07:15 GMT

ప్రస్తుతం దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల పరిస్థితి ఏ దర్శకుడికి రాదేమో అన్నట్టుగా ఉంది వ్యవహారం. పగవాళ్లకి కూడా వద్దండి ఈ పరిస్థితి అనేలా ఉంది. మహేష్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేసినా బ్రేక్ లేని శ్రీకాంత్ అడ్డాల మహేష్ తో తీసిన బ్రహ్మోత్సవం సినిమాతో కనబడకుండా పోయాడు. బ్రహ్మోత్సవం సినిమా తర్వాత మహేష్ తన తదుపరి సినిమాల్లో బిజీ అయ్యాడు. కానీ శ్రీకాంత్ మాత్రం ఇండస్ట్రీలో కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది.

శర్వానంద్ కి కథ చెప్పినా...

అయితే ఒక కొత్త కథతో శ్రీకాంత్ అడ్డాల హీరో శర్వానంద్ ని కలిసాడని... శర్వానంద్ కి శ్రీకాంత్ చెప్పిన కథ నచ్చిందని.. ప్రస్తుతం హను రఘవపుడి, సుధీర వర్మలతో చేసిన సినిమాలు పూర్తి కాగానే శర్వానంద్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నటిస్తాడని ప్రచారం జరిగింది. అయితే తాజాగా శ్రీకాంత్ అడ్డాల కథని శర్వానంద్ హోల్డ్ లో పెట్టేసాడని... శ్రీకాంత్ అడ్డాల శర్వానంద్ కోసం వెయిట్ చెయ్యలేక ఆ కథతో కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ సినిమాలతో దెబ్బతిన్న నానికి వినిపించినట్లుగా తెలుస్తుంది.

నాని కూడా వద్దన్నాడా..?

ఇక నానికి కథ నచ్చినా... ప్రస్తుతం ఏ డైరెక్టర్ కి నాని కమిట్ అయ్యే పరిస్థితుల్లో లేడట. ఎందుకంటే జెర్సీ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడం... బిగ్ బాస్ సీజన్ 2తో చిరాకుతో ఉన్న నాని ఒకేసారి రెండు సినిమాలు చేసే ఓపిక లేదంటున్నాడట. అలాగే ఇప్పటికే వరసగా రెండు సినిమాలు ప్లాప్ అవడంతో ప్లాప్ దర్శకుడితో సినిమా చేస్తే తన క్రేజ్ మరింతగా తగ్గుతుందని నాని భావించి.. శ్రీకాంత్ అద్దాలకు నో చెప్పేస్తాడనే టాక్ నడుస్తుంది. ఎలాగూ నాని ధైర్యం చేసి ఈ సినిమా చేసే అవకాశం లేదంటున్నారు.. మరి శర్వా, నానిలు కాదన్నా కథ ఏ హీరో దగ్గరికెళుతుందో చూద్దాం.--

Similar News