ఇది కదా శ్రీదేవి వారసత్వం!!

Update: 2018-06-02 06:25 GMT

శ్రీదేవి ఆశల సౌధం జాన్వీ కపూర్ ఇప్పుడు నిత్యం వార్తల్లోనే ఉంటుంది. జాన్వీ కపూర్ వెండితెర మీద తెరగేంట్రం చేస్తున్న ధఢక్ మూవీ మరికొన్ని రోజుల్లోనే ప్రేక్షకులముందుకు వస్తున్న తరుణంలో... జాన్వీ కపూర్ హడావిడి ఎక్కువైంది. తన తల్లి మరణించిన బాధనుండి పూర్తిగా కోలుకున్న జాన్వీ కపూర్ తన కజిన్ సోనమ్ కపూర్ పెళ్లి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొనడమే కాదు.. ఆ పెళ్ళిలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఇక అతిలోక సుందరి శ్రీదేవి కూతురు తన తల్లి అందాన్ని పుణికి పుచ్చుకుంది. ప్రస్తుతం ధఢక్ సినిమా ప్రమోషన్స్ మాటేమోగాని.. మ్యాగజైన్ కవర్ పేజెస్ మీద జాన్వీ కపూర్ సందడి మాములుగా లేదు. మొదటిసారి ఇలాంటి మ్యాగజైన్స్ కి ఫోటో షూట్స్ లో పాల్గొంటున్న జాన్వీ కపూర్ శ్రీదేవి అందానికి ఏమాత్రం తీసిపోవడం లేదన్నట్టుగా కనబడుతుంది.

శ్రీదేవి జ్ఞాపకాలను.....

హాట్ హాట్ ఫోటో షూట్స్ తో మరోసారి చెదిరిపోయిన శ్రీదేవి జ్ఞాపకాలను గుర్తుకు తెస్తుంది. ఇక ఆ మ్యాగజైన్ ఫోటో షూట్స్ లో జాన్వీ క్లివేజ్ అందాలు... ఆమె హాట్నెస్ చూసిన వారంతా ఇది కదా శ్రీదేవి వారసత్వం అంటూ చెప్పుకుంటున్నారంటే.. జాన్వీ ఏ రేంజ్ లో ఎక్సపోజ్ చేసిందో అర్ధమవుతుంది. మరి తాను నటించిన తొలి సినిమా ప్రమోషన్స్ కన్నా ముందే జాన్వీ ఇలా ఫోటో షూట్స్ తో రెచ్చిపోయి ఫోజులిస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. మంచి మంచి డిజైనర్ డ్రెస్సుల్లో అందాలు ఆరబోస్తూ జాన్వీ కపూర్ ఇచ్చిన హాటెస్ట్ ఫోజులు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. మరి శ్రీదేవి కూడా చనిపోయే వరకు హాట్ హాట్ డ్రెస్సులతో ఏమాత్రం మొహమాట పడకుండా మ్యాగజైన్ కోసం ఫోజిలిచ్చిన సందర్భాలు కోకొల్లలు.

అవసరమా అని కొందరు.....

మరి నిజంగా జాన్వీ చేసిన ఆ హాట్ ఫోటో షూట్ చూసిన ఎవ్వరికైనా మతిపోవాల్సిందే. ఆ రేంజ్ లో జాన్వీ తన అందాలను ఆరబోసింది. అయితే జాన్వీ అందాలను కొంతమంది పోగుతుంటే.. మరికొంతమంది మాత్రం అప్పుడే జాన్వికి ఇంత అవసరం ఏమొచ్చింది. ఇలా అందాలు ఆరబోస్తూ హాట్ హాట్ ఫోటో షూట్స్ అవసరమా అంటున్నారు. మరి హీరోయిన్ గా తెరంగేట్రం చేసాక ఆమాత్రం ఎక్సపోజింగ్ తో పాటుగా గ్లామర్ చాలా అవసరమే కదా. మరి అందమైన గ్లామర్ జాన్వీ కపూర్ ని మీరు ఓ లుక్కేసెయ్యండి.

Similar News