మీసం తిప్పలేకపోయిన శ్రీ విష్ణు

నీది నాది ఒకటే కథ, బ్రోచేవారెవరురా సినిమాలతో హీరో ఇమేజ్ సంపాదించుకున్న శ్రీ విష్ణు సినిమా మార్కెట్ లోకి వస్తుంది అంటే… మంచి అంచనాలు ఆ సినిమాపై [more]

Update: 2019-11-09 03:17 GMT

నీది నాది ఒకటే కథ, బ్రోచేవారెవరురా సినిమాలతో హీరో ఇమేజ్ సంపాదించుకున్న శ్రీ విష్ణు సినిమా మార్కెట్ లోకి వస్తుంది అంటే… మంచి అంచనాలు ఆ సినిమాపై పెరుగుతున్నాయి. అందులోను అంచనాలకు మించేలా వదులుతున్న ట్రైలర్స్ తో సినిమాలపై ఆసక్తి కలిగినట్టుగానే శ్రీ విష్ణు కొత్త చిత్రం తిప్పరా మీసం సినిమాపై కూడా అంచనాలు పెరిగిపోయాయి. ముందునుండి ప్రమోషన్స్ లో వీక్ అయినా… సినిమా విడుదలకు ముందు బాగా ప్రోమోట్ చేసి సినిమాని భారీ అంచనాల మధ్యన… శ్రీ విష్ణు క్రేజ్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు నిర్మాతలు. కృష్ణ విజయ్‌ దర్శకత్వంలో సింపుల్ స్టోరీ లైన్ తో తెరకెక్కిన తిప్పరా మీసం సినిమాకి ప్రేక్షకులు ప్లాప్ టాక్ ఇచ్చారు. ఇక క్రిటిక్స్ కూడా శ్రీ విష్ణు సినిమాని ఆడుకున్నారు. కథ, కథనాల్లో వీక్ గా వున్న సినిమా ని శ్రీ విష్ణు నటన గాని, మ్యూజిక్ గాని, క్లైమాక్స్ సన్నివేశాలు గాని నిలబెట్టలేకపోయాయి.

కథ, కథనం వీక్ గా ఉండడం, సాగదీత సన్నివేశాలు బోరు కొట్టించడం, ఎడిటింగ్ లో లోపాలు, బలమైన ఎమోషన్స్ లేకపోవడంతో సినిమాకి ప్లాప్ టాక్ పడింది. సినిమా మొత్తం మదర్ సెంటిమెంట్ తో నడిచింది. విష్ణు మదర్ కేరెక్టర్ లో రోహిణి శక్తికి మించి నటించింది. చిన్నప్పుడే మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన కొడుకుని డ్రగ్ అడిక్షన్ సెంటర్ కి పంపిన తల్లిమీద కొడుకు పెంచుకున్న పగతోనే సినిమా మొత్తం నడుస్తుంది. ఇక స్టోరీ లైన్ చిన్నదయినా… స్క్రీన్ ప్లే లో గ్రిప్ ఉంటె.. సినిమా హిట్టయ్యేది. కాని దర్శకుడు స్క్రీన్ ప్లే ని బలంగా చూపించలేకపోయాడు. ఇక సినిమాకి మెయిన్ హైలెట్ సినిమాటోగ్రఫీ తప్ప మారేది లేదు. మరి రెండు మంచి హిట్స్ తో ఉన్న శ్రీ విష్ణు తిప్పరా మీసం అంటూ మాస్ ఎలెమెంట్స్ తో వచ్చి మీసం తిప్పలేకపోయాడు

Tags:    

Similar News